రాణా ఆపరేషన్‌.. సాయి పల్లవితో పరేషాన్‌!

రాణా ఆపరేషన్‌.. సాయి పల్లవితో పరేషాన్‌!

రాణా, సాయి పల్లవి జంటగా 'విరాటపర్వం' ఖరారయి చాలా కాలమవుతోంది. ఎట్టకేలకు ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ మొదలయింది. అయితే షూటింగ్‌ మొదలు పెట్టే టైమ్‌కి రాణా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం విదేశాలకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ చిత్రానికి సాయి పల్లవి ఇచ్చిన డేట్స్‌ వేస్ట్‌ అవుతున్నాయి. శేఖర్‌ కమ్ములతో నాగచైతన్యకి జంటగా ఒక చిత్రం చేయడానికి అంగీకరించిన సాయి పల్లవి సెప్టెంబర్‌ నుంచి ఆ చిత్రం షూటింగ్‌లో బిజీ అవుతుంది.

అందుకే ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్‌ వాడుకోవాలని, లేదంటే ఇప్పట్లో డేట్లు ఇవ్వలేనని దర్శక, నిర్మాతలకి తేల్చి చెప్పింది. దీంతో సాయి పల్లవిపై సోలో సీన్లు మొత్తం ఇప్పుడు తీసేస్తున్నారు. ఒకవేళ షూటింగే చేయకపోతే ఈ చిత్రం నుంచి వైదొలుగుతానని సాయి పల్లవి అంటుందనే భయంతో హీరో కాంబినేషన్‌లో లేని సీన్లు మొత్తం లాగించేస్తున్నారు. రాణా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా సాయి పల్లవి వెంటనే షూటింగ్‌కి రాదట. శేఖర్‌ కమ్ముల చిత్రానికి గ్యాప్‌ వచ్చినపుడే ఈ చిత్రానికి మళ్లీ డేట్స్‌ ఇస్తుందట. అయినా కానీ ఈ పాత్రకి సాయి పల్లవి వుండి తీరాలని ఆమెని మిస్‌ కానివ్వకుండా కాపాడుకుంటున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English