సినిమా హిట్టయిందిగా.. అన్నీ సమసిపోయాయి

సినిమా హిట్టయిందిగా.. అన్నీ సమసిపోయాయి

సక్సెస్ ఉన్న చోట్ల తప్పులేవీ కనిపించవు. ఇబ్బందులన్నీ సమసిపోతాయి. కానీ ఫెయిల్యూర్ ఎదురైతేనే.. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా తయారవుతాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు కాలం కలిసొచ్చి పెద్ద హిట్టయిపోవడంతో రిలీజ్ ముంగిట ఉన్న సమస్యలన్నీ సర్దుబాటు అయిపోయినట్లు కనిపిస్తోంది. ఎంతో ఆలోచించి కానీ రామ్ ఈ సినిమా ఒప్పుకోలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’కు ముందు పూరి ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. రామ్ ఆయనతో సినిమా అంటే ఎంతోమంది వారించారు. కానీ ఏదో ధైర్యంతో అతను ఈ సినిమా ఓకే చేసేశాడు. ఐతే సినిమా మేకింగ్ సమయంలో పూరి-ఛార్మిలతో రామ్‌కు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని.. ఔట్ పుట్ విషయంలో రామ్ అంత సంతృప్తిగా లేడని.. ముందు చెప్పిన ప్రకారం పారితోషకం కూడా ఇవ్వకుండా బ్యాలెన్స్ పెట్టారని.. ఇలా రకరకాల గుసగుసలు వినిపించాయి.

పూరి చాలా కాలంగా సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్నాడు. కానీ వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవడంతో ఫైనాన్షియర్ల దగ్గర అప్పులు పేరుకుపోయాయి. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’కు బిజినెస్ బాగానే జరిగినా అనుకున్న మేర పూరి, ఛార్మిల చేతుల్లోకి డబ్బులు రాలేదు. దీంతో రామ్‌కు పారితోషకం పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ఫలితం మీద సందేహంతో, పారితోషకం దగ్గర పేచీ వల్లే రామ్ రిలీజ్ ముంగిట ఫారిన్ టూర్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐతే సినిమా రిలీజ్ ముంగిట అనూహ్యంగా దీనికి క్రేజ్ వచ్చింది. రిలీజ్ తర్వాత అది ఎలా ఇరగాడేస్తోందో తెలిసిందే. దీంతో పూరి అండ్ టీమ్ సమస్యలన్నీ తొలగిపోయాయి. అప్పులున్నీ తీరిపోయాయి. చేతిలోకి డబ్బులొచ్చాయి.

న్యాయంగా రామ్‌కు సక్సెస్‌లో వాటా ఇవ్వాలనుకున్నారు. దీంతో అతడికి లాభాల్లో వాటా పంచుతున్నారు. దీంతో తన టూర్‌ను కొంచెం కోత వేసుకుని మరీ రామ్ వెనక్కి వస్తున్నాడు. సక్సెస్ సంబరాల్లో భాగం కాబోతున్నాడు.ఈ రోజో రేపో హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్న రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ సందర్భంగా తాను పూరిని డైరెక్ట్ చేసిన ఒక షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేసి అభిమానుల్ని ఉత్సాహంలో ముంచెత్తాడు. టైటిల్ సాంగ్‌లో పూరి కనిపించి ‘రేయ్ ఇస్మార్ట్.. నువ్వు తురుంరా’ అని డైలాగ్ చెప్పే షాట్ అది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English