ఇటు మగధీర.. అటు ఆర్ఆర్.. టాక్ ఆఫ్ ద టౌన్ జక్కన్న

ఇటు మగధీర.. అటు ఆర్ఆర్.. టాక్ ఆఫ్ ద టౌన్ జక్కన్న

సైలెంటుగా ఎక్కడో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేసుకుంటున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. కానీ సామాజిక మాధ్యమాల్లో మంగళవారం అతడి పేరు మార్మోగిపోయింది. రాజమౌళి తీసిన ఒక మైల్ స్టోన్ మూవీ, తీస్తున్న మరో స్పెషల్ మూవీకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.

జులై 30.. రాజమౌళి కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనూ చిరస్థాయిగా నిలిచిపోయే తేదీ. దశాబ్దం కిందట తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ‘మగధీర’ విడుదలైంది ఆ తేదీనే. ఆ సినిమా సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జక్కన్న ‘బాహుబలి’ లాంటి మెగా మూవీ తీసేందుకు పునాది వేసింది, అతడిలో ఆత్మవిశ్వాసం నింపింది ‘మగధీర’నే.

అప్పటికి పరిమిత బడ్జెట్లోనే ఇండియాలో ఎవ్వరూ చేయని సాహసోపేత సినిమా తీశాడు జక్కన్న. అది తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది. దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది. అలాంటి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది.

వచ్చే ఏడాది సరిగ్గా ఇదే తేదీకి తన కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయబోతున్నట్లు జక్కన్న ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ హ్యాష్ ట్యాగ్స్‌తో నెటిజన్లు హంగామా చేశారు. ఈ రకంగా జక్కన్న పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English