ఇస్మార్ట్‌ లాభాల్లో రామ్‌కి వాటా ఇచ్చేసారు

 ఇస్మార్ట్‌ లాభాల్లో రామ్‌కి వాటా ఇచ్చేసారు

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాన్ని విపరీతమైన ఆర్థిక ఇబ్బందులలో వుండి నిర్మించిన పూరి జగన్నాధ్‌ మధ్యలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. సినిమా ముందుకి సాగే పరిస్థితి కూడా కనిపించకపోవడంతో రామ్‌ తన పారితోషికం తగ్గించుకున్నాడు. కొందరు టెక్నీషియన్లకి కూడా పూర్తిగా పారితోషికం ఇవ్వలేకపోయాడు. సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుందనే నమ్మకం కూడా పూర్తిగా లేకపోవడంతో పూరీ చాలా టెన్షన్‌ పడ్డాడు.

అయితే ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందుకున్న ఇస్మార్ట్‌ శంకర్‌తో పూరి కష్టాలు తీరిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మళ్లీ హ్యాపీగా వున్నాడు. ఈ చిత్రం సాఫీగా పూర్తి కావడం కోసం పారితోషికం తగ్గించుకున్న రామ్‌కి ఆ బ్యాలెన్స్‌ రెమ్యూనరేషన్‌ ఇచ్చేయడమే కాకుండా ఒప్పందంలో లేకపోయినా కానీ లాభాల్లోను వాటాని ఇవ్వడానికి పూరి, ఛార్మి డిసైడ్‌ అయ్యారు.

ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌ తీస్తే బాగుంటుందనే ఆలోచన పూరికి వుంది. ప్రస్తుతం అతనికి డేట్స్‌ ఇచ్చే హీరోలు కూడా లేరు కనుక రామ్‌తో వున్న రిలేషన్‌ని పదిలంగా కాపాడుకోవాలి. అందుకే అతడి మనసు గెలుచుకోవడానికి పూరి ఇలా అడగకుండానే లాభాల్లో వాటా ఇచ్చి రామ్‌ని మాత్రం స్మార్ట్‌గా తన సైడ్‌ వుంచుకున్నాడు. సీక్వెల్‌ చేయడానికి రామ్‌కి కూడా ఇష్టమే అయినా అది క్యాష్‌ చేసుకునే ప్రయత్నంలా కాకుండా చాలా పర్‌ఫెక్ట్‌గా వుండాలని మాత్రం చెప్పాడట. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English