మహేష్‌ తనని 'హీరో' చేస్తాడని ఆశపడ్డాడు!

మహేష్‌ తనని 'హీరో' చేస్తాడని ఆశపడ్డాడు!

మహర్షి చిత్రంలో సహాయ పాత్రని చేయడానికి అల్లరి నరేష్‌ అంగీకరించడానికో కారణం వుంది. హీరోగా తన మార్కెట్‌ బాగా పడిపోవడంతో, కొత్తగా ఆఫర్లు లేకపోవడంతో మళ్లీ జనం దృష్టిలో పడడానికి మహర్షి హెల్పవుతుందని భావించాడు. అయితే అల్లరి నరేష్‌ ఇంకా హీరో పాత్రలపై ఆశలు వదులుకోలేదు. కేవలం మహేష్‌ ఇమేజ్‌ని వాడుకుని తిరిగి ఫామ్‌లోకి రావచ్చునని అనుకున్నాడు.

కానీ మహర్షి చూసిన తర్వాత అతడికి అందరూ అలాంటి సహాయ పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు. హీరో అవకాశాలు వస్తాయని ఆశించిన అల్లరి నరేష్‌ దీంతో నిరాశ చెందాడు. పూర్తి స్థాయి క్యారెక్టర్‌ యాక్టర్‌గా మారే ఉద్దేశం లేదని చాలా ఆఫర్లు రిజెక్ట్‌ చేసాడు. మరో రెండు అలాంటి పాత్రలే చేస్తే కనుక తనని పూర్తిగా సైడ్‌ యాక్టర్‌గా ఫిక్స్‌ చేసేస్తారని నరేష్‌ భయపడుతున్నాడు.

అయితే నరేష్‌ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికి పడితే వారికి సహాయ పాత్రలు కూడా రావు. ఎంతో మంది సీనియర్‌ హీరోలలో జగపతిబాబు ఒక్కడే క్యారెక్టర్‌ యాక్టర్‌గా బిజీ అయ్యాడు. నవదీప్‌లాంటి వారికి ఎంత బాగా నటించినా సహాయ పాత్రలు కూడా రావడం లేదు.

తన అన్నయ్య ఆర్యన్‌ రాజేష్‌ 'వినయ విధేయ రామ'లో సపోర్టింగ్‌ రోల్‌ చేసినా మరో ఆఫర్‌ దక్కించుకోలేకపోయాడు. కేవలం హీరోగానే నటిస్తానంటూ భీష్మించుకుని కూర్చుంటే ఇక ఆ తర్వాత ఇలాంటి ఆఫర్లు కూడా రాకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English