పూరి జగన్నాధ్‌కి ఇక్కడయితే నో ఎంట్రీ!

పూరి జగన్నాధ్‌కి ఇక్కడయితే నో ఎంట్రీ!

తెలుగు చిత్ర సీమలోని అగ్ర హీరోలు ఇక తనతో పని చేయడానికి ఆసక్తి చూపించరనేది పూరి జగన్నాధ్‌కి క్లియర్‌ అయిపోయింది. చాలా కాలంగా మహేష్‌ నుంచి ఎలాంటి కబురు లేకపోవడంతో పాటు అతనికి చేతినిండా సినిమాలు వుండడంతో ఇక మహేష్‌ తనతో పని చేస్తాడనే నమ్మకం లేక ఆ అక్కసుని మీడియా ముఖంగా వెళ్లగక్కేసాడు. అలాగే ఇతర స్టార్‌ హీరోలు కూడా పూరీతో పని చేయడానికి ఆసక్తిగా లేరు.

ఇస్మార్ట్‌ శంకర్‌ని టాలీవుడ్‌ ఒక ఫ్లూక్‌ హిట్‌గానే పరిగణిస్తోంది కానీ పూరి జగన్నాధ్‌ మంచితనం వల్ల ఆ విజయాన్ని కొందరు హర్షిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడు కదా అని పూరి వెంట పడే సీన్‌ అయితే ఖచ్చితంగా లేదు. ఈ విషయం పూరీకి కూడా బోధపడడం వల్లనే తెలుగు అగ్ర హీరోలని వదిలేసి కన్నడ హీరో యష్‌ వెంట పడుతున్నాడు. కెజిఎఫ్‌తో నేషనల్‌ వైడ్‌ గుర్తింపు పొందిన యష్‌తో సినిమా చేయడానికి పూరి పావులు కదుపుతున్నాడు. ఇడియట్‌ని ముందుగా కన్నడలో తీసి సక్సెస్‌ అయిన పూరికి అక్కడ మంచి పేరే వుంది.

కన్నడ హీరోలు తెలుగు మార్కెట్‌ పెంచుకోవడానికి పూరిని బెస్ట్‌ ఆప్షన్‌ అనుకుంటారు. అయితే కెజిఎఫ్‌ 2 తర్వాత యష్‌ నిజంగా పూరితో చేస్తాడా? పూరి చెబుతోన్న 'జనగణమణ' కథ నిజంగా అంత దమ్మున్నదే అయితే మహేష్‌ అంత నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చేవాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English