శ్రీదేవి కోసం వెంటనే ఇంకోటి

శ్రీదేవి కోసం వెంటనే ఇంకోటి

దివంగత నటి శ్రీదేవి మీద తమిళ సూపర్ స్టార్ అజిత్‌కు ప్రత్యేక అభిమానం. ఆమె కోసం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో ఓ ప్రత్యేక అతిథి పాత్ర కూడా చేశాడు అజిత్. శ్రీదేవి మరణానంతరం ఆమె మీద మరింతగా అభిమానం చూపిస్తున్నాడు అజిత్. తన భర్త బోనీ కపూర్ నిర్మాణంలో అజిత్ సినిమా చేయాలన్నది శ్రీదేవి కోరిక. దాన్ని నిజం చేయడానికి బోనీ, అజిత్ చేతులు కలిపారు.

హిందీ హిట్ మూవీ ‘పింక్’ను తమిళంలో ‘నీర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేశారు. మామలూలుగా ఊర మాస్ సినిమాలు చేసే అజిత్.. తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్ర చేశాడీ చిత్రంలో. చక్కటి ట్రైలర్‌తో జనాల దృష్టిని ఆకర్షించిన ‘నీర్కొండ పార్వై’ ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ వెంటనే ‘నీర్కొండ పార్వై’ కాంబినేషన్లో మరో సినిమాను అనౌన్స్ చేస్తూ ఆశ్చర్యపరిచాడు బోనీ. శతురంగ వేట్టై, ఖాకి చిత్రాలతో చాలా మంచి పేరు సంపాదించిన హెచ్.వినోద్ ‘నీర్కొండ పార్వై’కి దర్శకత్వం వహించాడు. నిజానికి అతను అజిత్‌తో డైరెక్ట్ మూవీ చేయాలనుకున్నాడు. ఐతే ఆబ్లిగేషన్ మీద ‘పింక్’ను రీమేక్ చేయాల్సి వచ్చింది. దీని తర్వాత వినోద్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అజిత్ ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి బోనీనే ముందుకొచ్చాడు.

వినోద్ తొలి రెండు సినిమాల్లాగే అది కూడా యాక్షన్ థ్రిల్లర్ మూవీనే అని సమాచారం. తమిళంలో అజిత్‌తో సినిమా చేయడానికి క్రేజీ ఆఫర్లతో నిర్మాతలు క్యూలో ఉంటారు. కానీ వారిని కాదని బోనీతో వరుసగా రెండో సినిమా చేయడానికి అజిత్ ముందుకు వచ్చాడంటే అది శ్రీదేవి మీద అభిమానంతోనే అనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English