సొంత బుర్రా... లేక లేపేయాలా - పూరీ డైలెమా!

సొంత బుర్రా... లేక లేపేయాలా - పూరీ డైలెమా!

పోకిరి చూస్తే అచ్చంగా తెలుగు సినిమానే అనిపిస్తుంది కానీ ఆంగ్ల చిత్రాలని ఫాలో అయ్యేవారికి అందులోని ప్రతి త్రెడ్‌ వెనుక, ప్రతి పాత్ర చిత్రణ వెనుక ఏదో ఒక హాలీవుడ్‌ సినిమా స్ఫూర్తి తెలుస్తుంది. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కూడా డాన్స్‌ నేపథ్యం వున్న ఓ ఆంగ్ల చిత్రం నుంచే కథ తీసుకుని దానిని కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలోకి మార్చాడు పూరి. సొంత ఐడియాల కంటే కాపీ ఐడియాలతోనే పూరికి ఎక్కువ విజయాలు వచ్చాయి.

ఇటీవల వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ కోర్‌ ఐడియా కూడా క్రిమినల్‌ అనే సినిమా నుంచి కాపీ కొట్టేసినదే. దీంతో తన వద్ద వున్న కథతో సినిమా తీయాలా లేక మరేదైనా ఆంగ్ల చిత్రంలోని పాయింట్‌ తీసుకుని తన స్టయిల్లోకి మార్చాలా అనే సందిగ్ధంలో పూరి వున్నాడు. బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినా కానీ పూరి కోసం ఏ హీరో రెడీగా లేడు.

ఇప్పుడు పూరి ఒక కథ రాసుకుని అందుకు సూటయ్యే హీరో కోసం వెతుక్కోవాల్సిందే. అందుకోసమయినా పూరి దగ్గర ఇప్పుడో ఇస్మార్ట్‌ స్టోరీ అయితే వుండి తీరాలి. ఇస్మార్ట్‌ ఇంత హిట్‌ అవుతుందని ఊహించని పూరి తదుపరి చిత్రానికి కథ కూడా రెడీ చేసుకోలేదట. ఇంకా ఈ హిట్టుని జీర్ణించుకుంటోన్న అతను త్వరలోనే మళ్లీ పెన్నుకి పదును పెట్టి హీరో కోసం అన్వేషణ మొదలు పెడతాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English