రామ్ వస్తున్నాడు.. రచ్చో రచ్చస్య

 రామ్ వస్తున్నాడు.. రచ్చో రచ్చస్య

విదేశాల్లో క్రీడాకారులు పెద్ద విజయాలు సాధించి స్వదేశానికి తిరిగొస్తే ఘన స్వాగతం పలుకుతారు. ఊరేగింపుగా తీసుకొస్తారు. విజయోత్సవ సభలు నిర్వహిస్తారు. ఇంకో రెండు రోజుల తర్వాత యువ కథానాయకుడు రామ్‌కు ఇలాంటి స్వాగతాలే లభించి.. ఇలాగే ఊరేగించి.. ఇలాగే సంబరాల్లో ముంచెత్తితే ఆశ్చర్యం లేదు.

తన కొత్త సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ ముంగిట ప్రమోషన్లలో పాల్గొనకుండా స్నేహితులతో కలిసి యూరప్ టూర్ వెళ్లిపోయాడు రామ్. తనకు పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం.. పూరి, ఛార్మిలతో విభేదాల వల్లే అతను అలా టూర్ వెళ్లాడని ప్రచారం జరిగింది. దీన్ని రామ్ ఖండించాడు. ఈ సంగతలా వదిలేస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ అంచనాల్ని మించిపోయి బ్లాక్ బస్టర్ అయింది.

రెండో వారంలోనూ ఈ చిత్రం హౌస్ ఫుల్స్‌తో నడుస్తోంది. పూరి, ఛార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ ఊరూరా తిరిగేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడా రామ్ లేకపోవడమే లోటుగా ఉంది. ఐతే సినిమా రిలీజైన రెండు వారాలకు హైదరాబాద్ రాబోతున్నాడు. అతడి కోసం ‘ఇస్మార్ట్ శంకర్’ టీం, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు.

యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాను పైకి లేపడంలో.. ఇలా వసూళ్ల మోత మోగించడంలో రామ్‌ది కీలక పాత్ర. అలాంటి వాడు సినిమా దుమ్ముదులుపుతున్న టైంలో తన అడ్డాలోకి ఎంట్రీ ఇస్తుండటంతో రచ్చ రచ్చ చేయాలని పూరి, ఛార్మి భావిస్తున్నారు. దీని గురించి అప్ డేట్ ఇస్తూ.. రచ్చకు రెడీగా ఉండమని రామ్‌కు, అభిమానులకు పిలుపు ఇచ్చారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English