సినిమా తీయడానికి నాలుగేళ్లు.. విడుదలకు?

సినిమా తీయడానికి నాలుగేళ్లు.. విడుదలకు?

బాలీవుడ్లో ‘క్వీన్’ సినిమా విడుదలై ఐదేళ్లు దాటింది. ఈ చిత్రం విడుదలైన కొన్ని నెలలకే సౌత్ రీమేక్ గురించి అప్ డేట్ బయటికి వచ్చింది. నాలుగు భాషల్లో ఒకేసారి సినిమా తీయడం కోసం హక్కులు తీసుకున్నారు. ఇక అప్పట్నుంచి సన్నాహాలు చేస్తూనే చేస్తూనే ఉన్నారు. నాలుగు భాషలకు వేర్వేరుగా హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లను ఎంచుకోవడానికి ఏళ్లకు ఏళ్లు సమయం పట్టింది. చివరికి సినిమా అనుకున్న మూడేళ్ల తర్వాత కానీ ఇది పట్టాలెక్కలేదు.

తమన్నా, కాజల్ అగర్వాల్, మాంజిమా మోహన్, పారుల్ యాదవ్‌లను లీడ్ రోల్స్‌లో పెట్టుకుని ఎట్టకేలకు గతేడాది ‘క్వీన్’ సినిమాను నాలుగు భాషల్లో మొదలుపెట్టారు. మొదలయ్యాక కూడా తెలుగు వెర్షన్ నుంచి నీలకంఠ తప్పుకోవడంతో బ్రేకులు పడ్డాయి. ప్రశాంత్ వర్మను పట్టుకొచ్చి సినిమా పూర్తి చేశారు. చివరికి రీమేక్ చర్చలు మొదలైన నాలుగేళ్లకు ఈ సినిమా పూర్తయింది.

కానీ విడుదల సంగతే తేలట్లేదు. ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ ఈ సినిమాలకు అనుకున్నట్లుగా బిజినెస్ జరగట్లేదని సమాచారం. కాజల్ నటించిన తమిళ వెర్షన్‌కు టీజర్లోని ఒక షాట్ కారణంగా కొంచెం క్రేజ్ వచ్చింది. మిగతా భాషల్లో టీజర్లకు అనుకున్నంత రెస్పాన్స్ లేదు. ఎందుకోగానీ ముందు నుంచి ‘క్వీన్’ రీమేక్ మీద జనాల్లో అసలు ఆసక్తి లేదు.

ఏదో ఒక భాషలో కాజల్ లాంటి అమ్మాయిని పెట్టి సినిమా తీసి మిగతా భాషల్లోనూ డబ్ చేస్తే పోయేది. నాలుగు భాషల్లో వేర్వేరుగా సినిమా తీసి అనవసర హడావుడి చేశారు. మేకింగ్ విషయంలో నాన్చడం.. సరైన కాస్టింగ్ ఎంచుకోకపోవడం.. వివాదాలు చేటు చేసినట్లున్నాయి. ఫస్ట్ కాపీ రెడీ అయి ఆరు నెలలవుతున్నా ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. కొన్ని నెలలుగా ఈ సినిమాల గురించి చప్పుడే లేదు. మరి సినిమా తీయడానికి నాలుగేళ్లు పడితే.. రిలీజ్‌కు ఎన్నేళ్లు పడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English