మాస్ సెంటర్లలో రామ్ హవా!

మాస్ సెంటర్లలో రామ్ హవా!

వారం వ్యవధిలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది.. దేనికి బాక్సాఫీస్ దగ్గర మెరుగైన ఫలితం వస్తుంది.. ఏది ఎక్కువగా బయ్యర్లకు లాభాలు తెచ్చి పెడుతుంది అని ఒక రెండు వారాల ముందు ఎవరిని అడిగినా.. ‘డియర్ కామ్రేడ్’కే ఓటేసేవాళ్లు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. విజయ్‌ పెంచుకున్న ఫాలోయింగ్ వేరు. విజయ్ ముందు రామ్ మార్కెట్ తక్కువ. పైగా అతను ఫ్లాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో సినిమా చేశాడు.

అయితే విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ చుట్టూ ఎక్కువగా నెగెటివిటీనే కనిపించింది. కానీ రిలీజ్ ముంగిట పరిస్థితి మారిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోయాయి. వసూళ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తర్వాత కొంచెం జోరు తగ్గింది.

‘డియర్ కామ్రేడ్’ రాకతో ‘ఇస్మార్ట్ శంకర్’కు బ్రేకులు పడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ శుక్రవారం కొంచెం డౌన్ అయి మళ్లీ పుంజుకున్న ఈ చిత్రం వీకెండ్లో ‘డియర్ కామ్రేడ్’కు గట్టి పోటీ ఇవ్వడమే కాదు.. చాలా చోట్ల దాన్ని అధిగమించింది కూడా. సింగిల్ స్క్రీన్లలో ఆ చిత్రానికే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆదివారం ప్రతి షోకూ ‘డియర్ కామ్రేడ్’ కంటే ‘ఇస్మార్ట్ శంకర్’కు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

రాయలసీమలో చాలా చోట్ల రామ్ సినిమా హౌస్ ఫుల్స్‌తో నడిచింది. ‘డియర్ కామ్రేడ్’ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మాస్ సెంటర్లలో దీనికి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. అక్కడంతా ‘ఇస్మార్ట్ శంకర్’ హవానే నడుస్తోంది. ‘ఎ’ సెంటర్లలో.. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో మాత్రమే ‘డియర్ కామ్రేడ్’ పైచేయి సాధిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English