లీడర్‌ పోరీ పగటి కలల్లోనే..

లీడర్‌ పోరీ పగటి కలల్లోనే..

పట్టుమని పది సినిమాలు లేవు. చెప్పుకోదగ్గ హిట్టూ లేదు. అయినా రేటులో మాత్రం తగ్గనంటోంది డస్కీ సుందరి ప్రియా ఆనంద్‌. తెలుగులో ఒక్క సినిమా కూడా హిట్టుకాలేదు కాని, వరుసగా సినిమాలు చెయ్యడంతో తనకు బాగా డిమాండ్‌ పెరిగిందనుకొని పగటి కలలుకంటూ రేటును పెంచేసిందీ భామ. చెప్పిన పైకానికి నయాపైసా తగ్గినా సినిమా చేయనంటోంది. తెలుగులో ‘లీడర్‌’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘180’, ‘కో అంటే కోటి’ చిత్రాల్లో నటించినా సక్సెస్‌ లేక ఈ భామ కెరీర్‌ గాడితప్పింది.

దాంతో హిందీ, తమిళ పరిశ్రమలపై దృష్టిపెట్టి కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల శ్రీదేవితో కలిసి ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’లో నటించి హిట్‌ కొట్టింది. దాంతో నాలుగైదు సినిమాల్లో ఛాన్స్‌ రావడంతో ఒక్కసారిగా రెమ్యునరేషన్‌ పెంచేసిందిట. గతంలో ప్రియమణి వరుసగా సినిమాలు చేస్తూ..ఒక్క హిట్టూ లేకపోయినా తనకి డిమాండ్‌ ఉందనుకుని రేటు పెంచేసి తర్వాత ఢమాల్‌మంది. ప్రియా ఆనంద్‌ కూడా ఎక్స్‌ట్రాలు తగ్గించుకోకపోతే ప్రియమణి టైపులో నాలుగు చిన్న సినిమాలు చేసుకొని చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి వస్తుందేమో..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు