తెలుగు రాష్ట్రాల్లో.. కృష్ణా.. క‌నుమ‌రుగేనా...!

తెలుగు రాష్ట్రాల్లో.. కృష్ణా.. క‌నుమ‌రుగేనా...!

ఓ రెండు రోజుల పాటు ఆహారం లేక పోయినా ఉండొచ్చు.. కానీ, చుక్క‌నీరు లేక‌పోతే.. మాత్రం ఉండ‌లేం! నీటి విలువ చె ప్పేందుకు ఇలాంటి మాట‌లు అనేకం ఉన్నాయి. తాగ‌డానికే కాదు.. మ‌నం బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేందుకుకూడా నీరు కావాల్సిందే . తాగు, సాగుల‌కు నీటిని దూరం చేసుకోవ‌డ‌మే ఊహించ‌లేని ప‌రిణామం. ఈ క్ర‌మంలోనే దేశంలో జీవ‌న‌దుల‌కు పూజ‌లు చేస్తాం.. పుష్క‌రాల పేరుతో పండ‌గ‌లు చేస్తాం. వాటి సంరక్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌డ‌తాం. అయితే, ఈ జ‌ల‌మే రాష్ట్రాల మ‌ధ్య విల‌యానికి కార‌ణ‌మ‌వుతోంది. ఎవ‌రికి రాష్ట్ర బాగును వారు కోరుకోవ‌డం త‌ప్పుకాదు. అయితే, స్వార్థ రాజ‌కీయాల కార‌ణంగా ప‌క్క రాష్ట్రాలు ఏమైనా ఫ‌ర్వాలేద‌నే సంస్కృతి నేడు పెచ్చ‌రిల్లింది.

దీంతో జీవ‌న‌దుల‌పై ఎక్క‌డిక‌క్క‌డ విచ్చ‌ల‌విడిగా ఆన‌క‌ట్ట‌లు క‌ట్టి నీటిని అదుపు చేస్తేన్నారు. ఫ‌లితంగా ఆయా న‌ద‌లుకు సంబంధించి దిగువ‌న ఉన్న రాష్ట్రాలు ఎడారులుగా మారుతున్న ప‌రిస్తితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత విష‌యానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పై రాష్ట్రం నుంచి రావాల్సిన కృష్ణాన‌దికి ఆయా రాష్ట్రా లు ఎక్క‌డిక‌క్క‌డ ఆన‌క‌ట్ట‌ల‌తో బంధించ‌డంతో ప‌రిస్థితి దుర్భరంగా మారుతోంది. ప్ర‌ధానంగా కృష్ణాన‌ది నీటిని నిల్వ చేసుకునేందుకు నాగార్జున సాగ‌ర్‌, శ్రీశైలం జ‌లాశ‌యాలు ఉన్నాయి. వీటిలో నీటిని నిల్వ చేసుకుని అటు సీమ ప్రాంతాల‌కు ఇటు తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల‌కు నీటిని అందించే కార్య‌క్ర‌మం చేస్తారు.

అయితే, ఈ విష‌యంలో క‌ర్ణాట‌క రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల‌ను కూడా ఘోరంగా మోసం చేస్తోంది. ఏపీ భూభాగం లోకి వ‌దిలి పెట్టాల్సిన వ‌ర‌ద నీటిని కూడా కాలువ‌ల ద్వారా వివిధ మార్గాల్లో త‌ర‌లించుకుపోతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి ల‌భ్య‌త దిగ‌నాసిగా త‌యారైంది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌తో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ లో 90% మేర నీటినిల్వలు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 1703 అడుగుల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నాయి. సామర్థ్యా న్ని మించి ఎగువ నుంచి ఈ డ్యామ్‌లోకి నీటి నిల్వలు చేరుతుండడంతో, కృష్ణాజలాలు జూరాల, శ్రీశైలం జలాశయాల్లోకి వస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఆశించారు.

అయితే, ఆల్‌మ‌ట్టి నుంచి దిగువకు కేవలం 3,045 క్యూసెక్కులు మాత్రమే కర్ణాటక విడిచిపెట్టింది. అంటే.. ఎగువన కర్ణాటక కృష్ణా జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకుంటూ తమ అవసరాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటుంటే, దిగువన ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలూ ఆ జలాల కోసం మోరలు చాచి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి నీరు చేరకముందే, కృష్ణా జలాలను తూముల గుండా తమ రాష్ట్రంలోని పల్లపు ప్రదేశాల కు కర్ణాటక తరలిస్తోంది. దీంతో ఏపీలో రెండు ప్ర‌ధాన ప్రాజెక్టులు కూడా నీటి కోసం నోళ్లు తెరుచుకుని చూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

శ్రీశైలంలో ప్రస్తుతం 178.74 టీఎంసీలకు గాను 31.22 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీ లకుగాను 123 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కర్ణాటక తీరు మారకుంటే, ఈ జంట జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే జీవనాడి శ్రీశైలం జలాశయం. ఇదిప్పుడు వరద లేక వెలవెలబోతోంది. గత ఐదారేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని సాగునీటి నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఈ సమయానికి 804.40 అడుగుల వద్ద 31.22 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క క్యూసెక్కు వరద కూ డా జలాశయంలో చేరలేదు. ఉన్న నీటినే తెలంగాణ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.  మొత్తానికి క‌ర్ణాట‌క‌ రాష్ట్ర దాహం.. రెండు రాష్ట్రాల‌ను అల్లాడిస్తోంది. మ‌రి దీనిపై ఈ రెండు రాష్ట్రాలు ఎలా ముందుకువెళ్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English