పూరి జగన్నాథ్.. ఇక ఓన్లీ మాస్

పూరి జగన్నాథ్.. ఇక ఓన్లీ మాస్

పూరి జగన్నాథ్ అంటే మాస్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తీసిన సినిమాల్లో మెజారిటీ మాస్‌ను టార్గెట్ చేసినవే. ఐతే గత కొన్నేళ్లలో ఆయన మాస్ మంత్రం పని చేయలేదు. కొంచెం రూటు మార్చి ‘మెహబూబా’ అనే క్లాస్ సినిమా చేస్తే అది మరింత దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో తిరిగి తన రూట్లోకి వెళ్లిపోయాడు. తన శైలిని దాటి ఊర మాస్ మూవీ తీశాడు. అదే.. ఇస్మార్ట్ శంకర్.

ఈ చిత్రం అనూహ్య విజయాన్నందుకుంది. పూరికి చాలా కాలం తర్వాత పెద్ద విజయాన్నందించింది. దీంతో పూరి ఇకపై ప్రయోగాల జోలికి వెళ్లనంటున్నాడు. మాస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తానంటున్నాడు. తన కెరీర్లో ఎప్పుడూ సక్సెస్ కోసం తపించలేదని.. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని మాత్రం ఎంతగానో కోరుకున్నానని పూరి చెప్పడం విశేషం.

‘ఇస్మార్ఠ్‌ శంకర్‌’ సక్సెస్ ప్రెస్ మీట్లో పూరి మాట్లాడుతూ.. ‘‘నేను సక్సెస్‌ చూసి మూడేళ్లయింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్టవడంతో అందరూ నా మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయం వెనక చాలా టెన్షన్‌ ఉంది. జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ కోసం తపించని నేను మొదటిసారి ఈ సినిమాతో హిట్‌ కొట్టాలని పరితపించాను. ఫైనల్‌గా అనుకున్నది సాధించాను.

సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఆంధ్రాలో పర్యటించాం. రెస్పాన్స్ అదిరిపోయింది. ‘ఇస్మార్ట్‌ 2’ ఎప్పుడని చాలామంది అడిగారు. వెంటనే కథ రెడీ చేసి సినిమా మొదలుపెట్టాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఆ సినిమా కోసం ‘డబల్‌ ఇస్మార్ట్‌’ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించా. భవిష్యత్తులో మాస్‌ ఫీల్‌ ఉన్న సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నా’’ అని పూరి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English