ఇస్మార్ట్ శంకర్‌కు ఎదురు లేదు

ఇస్మార్ట్ శంకర్‌కు ఎదురు లేదు

తొలి రోజు ఏడున్నర కోట్లు.. వీకెండ్లో 22 కోట్లు.. వారంలో 29 కోట్లు.. ఏంటీ లెక్కలంటారా? 'ఇస్మార్ట్ శంకర్' సాధించిన వసూళ్లు. ఫ్లాపుల్లో మునిగి తేలుతున్న వాళ్లు కలిసి చేసిన ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు అనూహ్యం. తొలి వారంలో ఆ చిత్రానికి ఎదురే లేకపోయింది. ఐతే ఈ వారాంతంలో 'డియర్ కామ్రేడ్' వస్తుండటంతో 'ఇస్మార్ట్ శంకర్' జోరుకు బ్రేక్ పడటం ఖాయమనుకున్నారు.

శుక్రవారం పరిస్థితి చూస్తే అది నిజమే అనిపించింది. మాస్, క్లాస్ సెంటర్లని తేడా లేకుండా అన్ని చోట్లదా తొలి రోజు 'డియర్ కామ్రేడ్' హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఎ సెంటర్లలో సినిమా బాగానే ఆడొచ్చేమో.. కానీ బి, సిల్లో మాత్రం 'డియర్ కామ్రేడ్' నిలబడేలా కనిపించడం లేదు.

శుక్రవారం మార్నింగ్ షో, మ్యాట్నీలకు 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్లు తగ్గాయి. కానీ సాయంత్రానికి సినిమా మళ్లీ పుంజుకుంది. మాస్ సెంటర్లలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. శనివారం మాస్ ఏరియాల్లో 'ఇస్మార్ట్ శంకర్' యధావిధిగా కొనసాగుతోంది. మాస్ ప్రేక్షకులకు 'డియర్ కామ్రేడ్' ఏమాత్రం రుచించే పరిస్థితి లేదు. వాళ్లు మళ్లీ 'ఇస్మార్ట్ శంకర్' వైపే చూస్తున్నారు.

మల్టీప్లెక్సుల్లో ముందు నుంచి ఈ చిత్రానికి వసూళ్లు తక్కువే ఉన్నాయి. వాటిని 'డియర్ కామ్రేడ్'కు వదిలేసి సింగిల్ స్క్రీన్లలో.. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో హవా కొనసాగిస్తున్నాడు 'ఇస్మార్ట్ శంకర్'. 'డియర్ కామ్రేడ్'కు డివైడ్ టాక్ రావడంతో 'ఇస్మార్ట్ శంకర్' రూ.40 కోట్ల షేర్ మార్కు అందుకోవడానికి మార్గం సుగమమైనట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English