చరణ్‌ ట్వీట్‌ వేసాడు... గేట్‌ కూడా తెరుస్తాడా?

చరణ్‌ ట్వీట్‌ వేసాడు... గేట్‌ కూడా తెరుస్తాడా?

చిరంజీవితో ఒక సినిమా తీయాలనేది పూరి జగన్నాధ్‌ చిరకాల స్వప్నం. చిరు వీరాభిమాని అయిన పూరి ఎన్నోసార్లు ప్రయత్నించినా కానీ మెగాస్టార్‌తో సినిమా ఓకే అవలేదు. ఆమధ్య ఆటోజానీ చిత్రం విషయంలో పూరి చెప్పిన కథలో సెకండాఫ్‌ నచ్చలేదని చిరంజీవి మీడియాతో చెప్పడంతో పూరి హర్టయ్యాడు. కథ నచ్చకపోతే తనకి చెప్పాలి కానీ మీడియాకి చెప్పడమేంటని బాధ పడ్డాడు. దాంతో మెగాస్టార్‌తో దూరం పెరిగిందని అనుకున్నారు. అయినా ఆ తర్వాత కూడా పూరి మళ్లీ చిరుకి ఒక కథ వినిపించాడట కానీ అదీ ఓకే అవలేదు.

'ఇస్మార్ట్‌ శంకర్‌' హిట్టయిన తర్వాత మహేష్‌, ఎన్టీఆర్‌లతో కాకుండా చిరంజీవితో సినిమా చేయాలనే పూరీ అభిలషించాడు. మెగాస్టార్‌ ఓకే అంటే అయిదు రోజుల్లో కథ రెడీ చేసేస్తానని కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీనిని మెగా ఫ్యామిలీ పరిగణించినట్టే వున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ని పనిగట్టుకుని చూసిన చరణ్‌ అందులో రామ్‌ ఎనర్జీని, పూరి స్కిల్స్‌ని మెచ్చుకున్నాడు. మిగిలిన టాప్‌ హీరోలు ఎవరూ పట్టించుకోని ఈ చిత్రం గురించి చరణ్‌ మాత్రమే స్పందించాడు.

ఈ ట్వీట్‌తో పూరికి మళ్లీ మెగా కాంపౌండ్‌ గేట్లు తెరుచుకుంటాయా? ఈ విధంగా కథ వుంటే రమ్మనమని చరణ్‌ సంకేతాలు పంపించాడా? చిరు కుటుంబం నుంచి మాస్‌ సినిమాలయితే అడపాదడపా వస్తుండాలి కనుక పూరి ఆప్షన్‌ని ఓపెన్‌గా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English