వావ్.. ఆ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి

వావ్.. ఆ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి

ఒక విదేశీ క్రికెటర్ మీద సినిమా తీయడం.. అందులో ఒక దక్షిణాది నటుడు ప్రధాన పాత్ర పోషించడం అరుదైన విషయం. తమిళంలో ఇలాంటి అరుదైన సినిమానే రాబోతోంది. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మీద కోలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఇదే పెద్ద విశేషం అంటే.. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడు లీడ్ రోల్ చేయబోతుండటం మరింత ఆసక్తికరం. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే విజయ్..  మురళీధరన్ పాత్రలో కనిపించబోతున్నాడనగానే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి వ్యక్తమవుతోంది. మురళీధరన్ లాగా అతడికి ఎలా మేకోవర్ చేస్తారన్నది ఆసక్తికరం.

సినిమాగా తీయడానికి సరిపడా స్టఫ్ మురళీ జీవితంలో చాలానే ఉంది. వ్యక్తిగతంగా అతను చాలా సౌమ్యుడు. కానీ అతడి బౌలింగ్ చూస్తే మాత్రం ప్రత్యర్థులకు దడ. విచిత్రమైన.. భయపెట్టేలా ఉండే అతడి బౌలింగ్ యాక్షనే సగం బెదరగొట్టేస్తుంది. మిగతా సగం పని మెలికలు తిరిగే అతడి బంతి పూర్తి చేస్తుంది.

మురళీ బౌలింగ్ త్రో అంటూ పలుమార్లు ఫిర్యాదులు రావడం.. అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి రావడం.. మన లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మురళీని జావెలిన్ త్రోయర్ అనడం.. ఆస్ట్రేలియా ప్రేక్షకులు గేలి చేయడం.. అంపైర్ వరుసగా నోబాల్స్ ఇవ్వడం.. ఇలా ఎన్నో వివాదాల్ని, అడ్డంకుల్ని అధిగమించి ఏకంగా 800 వికెట్లతో టెస్టు  క్రికెట్ చరిత్రలోనే హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలవడం.. ఇలా  మురళీ జీవితంలో మలుపులెన్నో.

ఇలాంటి పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తే సినిమా రేంజే వేరుగా ఉంటుంది. మురళీని అతనెలా అనుకరిస్తాడన్నది ఆసక్తికరం. తమిళంలో ఈ చిత్రం తెరకెక్కడం, విజయ్ సేతుపతి తన పాత్రలో నటించడం తనకు దక్కిన గౌరవం అని మురళీ పేర్కొన్నాడు. మురళీకి తమిళం వచ్చు. అతను తమిళ సినిమాలు చూస్తాడు. అతను పెళ్లాడింది కూడా తమిళ అమ్మా యినే అన్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English