మహేష్‌, అల్లు అర్జున్‌కి దూరంగా!

మహేష్‌, అల్లు అర్జున్‌కి దూరంగా!

సంక్రాంతి బరిలో పందెం పుంజుల్లా మహేష్‌, అల్లు అర్జున్‌ తలపడపోతున్నారు. వీళ్లకి తోడు ఓల్డ్‌ హార్స్‌ బాలకృష్ణ వుండనే వున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల్లుఅర్జున్‌19 చిత్రాలు సంక్రాంతికి ఏ డేట్‌కి వస్తాయి, ఎంత డిస్టెన్స్‌ పాటిస్తాయనేది ఇంకా తెలియదు. కాకపోతే రెండు భారీ చిత్రాలు పోటీలో వుండడంతో ఈసారి వాటి మధ్యకి వెళ్లడానికి చిన్న, మీడియం రేంజ్‌ సినిమాలకి ధైర్యం చాలడం లేదు.

మామూలుగా అయితే సంక్రాంతికి ఓ చిన్న సినిమాకి కూడా చోటుంటుంది కానీ ఈసారి పోటీ తీవ్రంగా వుంది కనుక నిర్మాతలు దూరంగా వుండాలని డిసైడ్‌ అయ్యారు. సంక్రాంతి తర్వాత మళ్లీ బాక్సాఫీస్‌ డల్‌ అయిపోతుంది కనుక ముందుగానే అంటే డిసెంబర్‌లోనే వచ్చేయాలని పలువురు హీరోలు డిసైడయ్యారు. నితిన్‌ 'భీష్మ'తో పాటు రవితేజ 'డిస్కోరాజా' డిసెంబర్‌ బరిలో నిలవగా, తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ 'ప్రతిరోజు పండగే' చిత్రం కూడా డిసెంబర్‌ బెర్త్‌కే పోటీ పడుతున్నట్టు చెబుతున్నారు.

ఇవి కాకుండా మరో రెండు, మూడు చెప్పుకోతగ్గ చిత్రాలు డిసెంబర్‌లోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతికి అటు దిల్‌ రాజు సినిమా, ఇటు గీతా ఆర్ట్స్‌ చిత్రం వస్తున్నాయంటే థియేటర్లు దొరకని పరిస్థితి వుంటుంది కనుక ఆ క్లాష్‌లో వేలెట్టడం దేనికని ఎవరికి వారే జాగ్రత్త పడిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English