ముందు ఫ్లాపు, తరువాత క్లాసిక్‌

ముందు  ఫ్లాపు, తరువాత క్లాసిక్‌

సింధూరం, అంతపురం, రాఖి సినిమాలు రిలీజైనప్పుడు  ఫ్లాపులే.. కాని ఇప్పుడు మాత్రం అవన్నీ క్లాసిక్‌ సినిమాలు.. ఇదే క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ స్పెషాలిటీ. ఆయన సినిమా రిలీజైన తొలిరోజు చూసినవెంటనే ఇదేం సినిమా అనేస్తారు. ఆనక తీరిగ్గా ఏ టీవీలోనో వచ్చేసినప్పుడు అరే ఇంత క్లాసిక్‌ సినిమానా! అని నాలుక్కరుచుకుంటారు. తినగ తినగ వేము తీయన చందంగా కృష్ణవంశీ సినిమాలన్నీ చూడగా చూడగా గొప్పగా అనిపిస్తాయి. సంస్కృతి సాంప్రదాయం, కుటుంబ అనుబంధాలు, మానవతా విలువలు ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిలోని తీపి జనాలకి నెమ్మదిగా కనెక్ట్‌ అవుతుంది.

‘సింధూరం’ సెకెండ్‌ రిలీజ్‌కి సక్సెసైంది. ‘అంత:పురం’లో హీరోలేడు. ఇదేం సినిమా అన్నారు రిలీజ్‌రోజు. కల్ట్‌ జానర్‌లో వచ్చిన ఈ సినిమాలకు నెమ్మదిగానే జనం బ్రహ్మరథం పట్టారు. విమర్శకులు ప్రశంసలూ దక్కాయి. అవార్డులు, రివార్డులు కురిశాయి. ప్రస్తుతం ఇదే క్రియేటివ్‌ డైరెక్టర్‌ నుంచి నాని హీరోగా ‘పైసా’ రిలీజవుతోంది. మునుపటిలా కాకుండా ఈ సినిమా అయినా ఫస్ట్‌ డే నుంచీ హిట్‌ టాక్‌తో కలెక్షన్ల అదరగొట్టాలని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు