ఎన్టీఆర్‌ కొత్త లవర్‌ ఈవిడే!

ఎన్టీఆర్‌ కొత్త లవర్‌ ఈవిడే!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌లతో రూపొందుతోన్న మల్టీస్టారర్‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో ఎన్టీఆర్‌ సరసన ఒక విదేశీ హీరోయిన్‌ కావాలనే సంగతి తెలిసిందే. ముందుగా డెయిసీ ఎడ్గార్‌ జోన్స్‌ని ఆ పాత్రకి ఖరారు చేయగా, ఆమె ఎందుకో ఈ చిత్రం నుంచి తప్పుకుంది. అప్పట్నుంచీ మరో విదేశీ తార కోసం రాజమౌళి అన్వేషిస్తున్నాడు. చిన్న పాత్ర కనుక పెద్ద హీరోయిన్లు దొరకరని అతనికి తెలుసు.

చిన్న పాత్ర అయినా విదేశాల నుంచి ఒక హీరోయిన్‌ని తీసుకురావడం కష్టమే. చాలా కాలం అన్వేషిస్తే ఫైనల్‌గా ఎమ్మా రాబర్ట్స్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్టు తెలిసింది. ఆమె వైల్డ్‌ ఛైల్డ్‌, నెర్వ్‌ తదితర చిత్రాల్లో నటించింది. హాలీవుడ్‌లో అంత పాపులర్‌ కాదు కానీ రాజమౌళి రాసుకున్న పాత్రకి ఆమె సూటవుతుంది. అయితే ఇంకా స్క్రీన్‌ టెస్ట్‌ జరగలేదు కనుక ఈ వార్తని అధికారికంగా పరిగణించనక్కర్లేదు.

ఈ పాత్రకి హీరోయిన్‌ ఫైనలైజ్‌ అయితే వచ్చే షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ లవ్‌స్టోరీకి సంబంధించిన సీన్స్‌ అన్నీ ఒకేసారి పూర్తి చేసేస్తారు. మరోవైపు చరణ్‌ జోడీగా నటిస్తోన్న ఆలియా భట్‌ కూడా ఇటీవలే షూటింగ్‌లో జాయిన్‌ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English