పెదనాన్నని దూరం పెట్టిన ఇస్మార్ట్‌ రామ్‌!

పెదనాన్నని దూరం పెట్టిన ఇస్మార్ట్‌ రామ్‌!

రామ్‌ హీరో కావడంలో, అతని కెరియర్‌ని తీర్చిదిద్దడంలో అతని పెదనాన్న, సీనియర్‌ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ పాత్ర చాలా వుంది. ఇంతవరకు రామ్‌ తీసుకునే ప్రతి నిర్ణయంలోను రవికిషోర్‌ ఆలోచనలు కూడా జత కలిసాయి.

అతనితో ఎన్నో హిట్‌ సినిమాలని నిర్మించిన రవికిషోర్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌' విషయంలో మాత్రం రామ్‌కి అడ్డు చెప్పాడట. అయితే మాస్‌ హీరో కావాలనే కోరిక చాలా వున్న రామ్‌ 'పోతే ఇంకో సినిమా పోతుంది. అంతేగా' అంటూ పూరి జగన్నాధ్‌తో రిస్క్‌ చేసాడట.

అతను తీసుకున్న రిస్క్‌కి రిజల్ట్‌ ఏమిటనేది తెలిసిందే. ప్రస్తుతం ఇస్మార్ట్‌ శంకర్‌ అన్ని ఏరియాల్లో దుమ్ము దులిపేస్తోంది. రామ్‌ డెసిషన్‌ పర్‌ఫెక్ట్‌ అని తేలడంతో అతనికి కాన్ఫిడెన్స్‌ పెరిగింది.

ఇకపై మాస్‌ సినిమాల మీద ఫోకస్‌ పెట్టాలని డిసైడ్‌ అయిన రామ్‌ సబ్జెక్టులు కూడా తానే సెలక్ట్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ని క్యాష్‌ చేసుకునే అవకాశాన్ని తన పెదనాన్నకి ఇచ్చి మలి చిత్రం స్రవంతి మూవీస్‌లో చేస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు.

ఒకవేళ చేసిన పక్షంలో కథ ఎంపిక దగ్గర్నుంచి పబ్లిసిటీ వరకు అన్నిటా తనదే పెత్తనం అవ్వాలని మాత్రం పెదనాన్నకి చెప్పేస్తాడని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English