వరుణ్ సందేశే బిగ్ బాస్-3 విన్నరట.. ఎలాగంటే?

వరుణ్ సందేశే బిగ్ బాస్-3 విన్నరట.. ఎలాగంటే?

తెలుగు ‘బిగ్ బాస్’ మూడో సీజన్ మొదలై ఒక్క రోజే అయింది. ఇప్పటికే ఈ సీజన్ విజేత ఎవరో జనాలు నిర్ణయించేశారు. ఇది జనాలు తమకు నచ్చిన వ్యక్తిని విజేతగా ప్రకటించడం కాదు.. ఒక లాజిక్ ప్రకారం ఈ సారి విన్నర్ ఫలానా వ్యక్తి అని ప్రకటిస్తుండటం విశేషం.

ఆ వ్యక్తి మరెవరో కాదు.. యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఇతనే విజేత అనడానికి నెటిజన్లు కాజల్ అగర్వాల్‌తో అతడికి ఉన్న కనెక్షన్‌ను ప్రస్తావిస్తున్నారు. తొలి సీజన్ విజేత శివబాలాజీ.. ‘చందమామ’ సినిమాలో కాజల్‌కు బావగా నటించాడు.

తర్వాతి సీజన్లో విన్నర్ అయిన కౌశల్ మండ.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలో కాజల్‌కు బావగా నటించిన సంగతి తెలిసిందే. వరుణ్ విషయానికి వస్తే.. అతను కాజల్ చెల్లెలైన నిషా అగర్వాల్‌కు జోడీగా ‘ఏమైంది ఈవేళ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ లెక్కన కాజల్‌కు అతను మరిది అవుతాడట. ఈ కనెక్షన్ కారణంగా గత రెండు సీజన్ల ఒరవడిని కొనసాగిస్తూ ఈసారి వరుణ్ విజేతగా నిలుస్తాడంటూ మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు నెటిజన్లు. మరి ఈ లాజిక్ ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.

విశేషం ఏంటంటే ఈసారి వరుణ్‌తో పాటుగా అతడి భార్య వితిక సైతం  ఈసారి ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంటరవడం విశేషం. ఇలా భార్యాభర్తలు కలిసి ‘బిగ్ బాస్’లోకి రావడం ఇదే తొలిసారి. మరి వాళ్లిద్దరినీ ఒక యూనిట్‌గా తీసుకుంటారా.. వేర్వేరు వ్యక్తుల్లా చూస్తారా అన్నది ఆసక్తికరం. ‘

బిగ్ బాస్-3’ తొలి రోజు విశేషాలతోనే వందల్లో మీమ్స్ వచ్చి పడిపోవడాన్ని బట్టి ఈ షోకు జనాల్లో ఏ స్థాయిలో ఆసక్తి ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. రాబోయే మూడు నెలలు నెటిజన్లకు పండగే అనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English