నానికి రెండుసార్లు దెబ్బకొట్టిన ప్రభాస్‌!

నానికి రెండుసార్లు దెబ్బకొట్టిన ప్రభాస్‌!

'సాహో' రిలీజ్‌ ఆగస్ట్‌ 30న గ్యారెంటీనా కాదా అనేది ఇంకా తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ డేట్‌ని రిజర్వ్‌ చేసుకున్నారు. దీంతో అదే రోజున రిలీజ్‌ ప్లాన్‌ చేసిన గ్యాంగ్‌లీడర్‌ చిత్రాన్ని వేరే డేట్‌కి వాయిదా వేయక తప్పింది కాదు. ఒకవేళ సాహోతో పోటీకి గ్యాంగ్‌లీడర్‌ సై అన్నా బయ్యర్లు వెనకాడతారు. అందుకే ఎలాంటి గొడవ లేకుండా గ్యాంగ్‌లీడర్‌నే వాయిదా వేసుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని మొదట్లో ఆగస్ట్‌ 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సాహో రిలీజ్‌ వుందని రెండు వారాలు వాయిదా వేసారు. తీరా సాహో ఆగస్ట్‌ 15నుంచి వాయిదా పడినా కానీ తమ సినిమా పూర్తి కాకపోవడంతో ముందుకి రాలేకపోయారు. కానీ ఈసారి మాత్రం ఆగస్ట్‌ 30నుంచి వాయిదా పడినా కానీ ఫైనల్‌ కట్‌ అయితే రెడీ చేసేస్తున్నారు.

ఒకవేళ సాహో మళ్లీ వాయిదా పడిన పక్షంలో గ్యాంగ్‌లీడర్‌ని యథాతథంగా ఆగస్ట్‌ 30న రిలీజ్‌ చేస్తారు. ఏదేమైనా ఒకే సినిమా వల్ల రెండు సార్లు రిలీజ్‌ ప్లాన్స్‌ అప్‌సెట్‌ అవడంతో గ్యాంగ్‌లీడర్‌ మేకర్స్‌ చాలా ఫీలవుతున్నారు.

తమ సినిమా వాయిదా వేస్తున్నపుడు కర్టసీగా అయినా కాల్‌ చేసి 'మీరు రిజర్వ్‌ చేసుకున్న డేట్‌కి అనివార్య కారణాల వల్ల వస్తున్నాం' అని చెప్పలేదని, అదే ఆ డేట్‌కి ఏదైనా పెద్ద సినిమా రిలీజ్‌కి రెడీగా వుంటే ఇలాగే చేసేవారా అని బాధ పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English