తండ్రి జాతకం మార్చేసిన పూరీ కొడుకు

తండ్రి జాతకం మార్చేసిన పూరీ కొడుకు

'ఇస్మార్ట్‌ శంకర్‌' రామ్‌ కోసమే రాసిన కథ అంటూ పూరి జగన్నాథ్‌ చెప్పుకుంటున్నాడు కానీ 'మెహబూబా' ఫ్లాప్‌ అయిన తర్వాత తన శైలిలో తనయుడు ఆకాష్‌ని లాంఛ్‌ చేయలేదనే ఫీలింగ్‌తో పూరీ ఈ కథ రాసుకున్నాడు. ఎలాగయినా ఆకాష్‌కి హీరోగా బ్రేక్‌ ఇవ్వాలనే కసితో పూరీ రాసుకున్న కథే ఇస్మార్ట్‌ శంకర్‌.

కానీ కథ విన్న వాళ్లు ఇంకా పసితనం ఛాయలు పోని ఆకాష్‌కి ఎక్కువ అయిపోతుందని, ఎవరైనా ఎస్టాబ్లిష్డ్‌ హీరోతో చేయమని సలహాలిచ్చారు. అప్పుడే పూరీ వేరే హీరోల కోసం ప్రయత్నిస్తూ రామ్‌ని సంప్రదించాడు. బాగా మాస్‌గా వుండే బ్యాడ్‌ బోయ్‌ తరహా పాత్ర కావాలని రామ్‌ అడగడంతో పూరీ తన కథని కాస్త మార్చుకుని రామ్‌కి అనుగుణంగా క్యారెక్టరైజేషన్‌లో ఛేంజెస్‌ చేసాడు.

అలా ఇస్మార్ట్‌ శంకర్‌కి బీజం పడింది. అంటే కొడుకుని హీరోగా నిలబెట్టాలనే తపనలోంచి పూరీ రాసుకున్న కథ ఇది. అదే ఇప్పుడు పూరీ పాలిట వరమయింది. ఈమధ్య కాలంలో అతను తీసిన సినిమాల వల్ల పూరి జగన్నాథ్‌ ఒక ఆల్‌మోస్ట్‌ గోన్‌ అనేసుకున్నారు కానీ ఇస్మార్ట్‌ విజయంతో మళ్లీ పూరీ టైమ్‌ స్టార్ట్‌ అయింది.

కనీసం తదుపరి రెండు, మూడు సినిమాలకి అయినా ఎలాంటి ఢోకా వుండని రేంజ్‌ తిరిగి వచ్చింది. ఇదే సినిమా ఆకాష్‌తో తీసినట్టయితే ఈ రెస్పాన్స్‌ అయితే ఖచ్చితంగా వచ్చి వుండేది కాదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English