హేమ పై శ్వేత దారుణమైన వ్యాఖ్యలు

హేమ పై శ్వేత దారుణమైన వ్యాఖ్యలు

‘బిగ్ బాస్’లో కాస్టింగ్ కౌచ్ నడుస్తోందని.. తన పట్ల ‘బిగ్ బాస్’ టీం అసభ్యంగా ప్రవర్తించిందని యాంకర్ శ్వేతారెడ్డి కొన్ని రోజుల కిందట చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఐతే పోలీసులు సరిగా స్పందించడం లేదని.. తగు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపిస్తోంది.

కేసు పురోగతిపై, ఇతర విషయాలపై ఆమె తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో అక్కినేని నాగార్జున, ఆయన మేనకోడలు సుప్రియతో పాటు నటి హేమను కూడా టార్గెట్ చేసింది. తన ఫిర్యాదు నేపథ్యంలో స్టార్ గ్రూప్ స్పందించిందని. స్టార్ ఇండియా గ్రూప్ ఇంటర్నల్ కమిటీ ఈ వివాదంపై దర్యాప్తు చేస్తోందని.. కానీ పోలీసులు ఇంకా చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించింది.

తాను నాగార్జునకు అభిమానినని.. కానీ తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన కానీ.. అక్కినేని ఫ్యామిలీ నుంచి క్యాష్ కమిటీలో మెంబర్‌గా ఉన్న సుప్రియ కానీ స్పందించకపోవడం దారుణమని ఆమె అంది.  తాను చేసిన ఆరోపణల్ని కొట్టి పారేసిన నటి హేమ మీద శ్వేత దారుణమైన వ్యాఖ్యలు చేసింది.

‘‘ఆమె లాగా బిగ్‌బాస్ షోకి వెళ్ళాలనే కక్కుర్తి నాకు లేదు. కమిట్మెంట్‌లు, అగ్రిమెంట్‌లు మీకు పరిపాటి అయ్యుండొచ్చు, నాకు కాదు’’ అని ఆమె వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ షోతో బలైన మహిళలు బయటికి వచ్చి మాట్లాడాలని.. సోషల్ యాక్టివిస్టులు, రాజకీయ పార్టీల నేతలు తనకు సపోర్ట్ చేయాలని శ్వేతారెడ్డి కోరింది. ఆడపిల్లల రక్షణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని.. కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ఈ అంశంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English