సూర్య హర్టయ్యాడు.. కౌంటర్ ఇచ్చాడు

సూర్య హర్టయ్యాడు.. కౌంటర్ ఇచ్చాడు

తమిళనాట వ్యక్తిగతంగా చాలా మంచి పేరున్న హీరో సూర్య. ఆయనకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘అగరం’ పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. సూర్య కుటుంబం మొత్తం దీని కోసం ఎంతో ఖర్చు చేస్తోంది. తమ సొంత ఇంటినే ఈ ఫౌండేషన్ కోసం ఇచ్చేసిన దాతృత్వం సూర్య కుటుంబానిది.

చాలామంది సెలబ్రెటీలు పబ్లిసిటీ కోసమో, పన్ను మినహాయింపుల కోసమో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ సూర్య ఈ కోవకు చెందడని అందరికీ తెలుసు. వివిధ సామాజిక సమస్యలపై సూర్య ఎంతో జెన్యూన్‌గా స్పందిస్తుంటాడు కూడా. తాజాగా ఆయన జాతీయ విద్యావిధానం గురించి ఒక సదస్సులో మాట్లాడాడు. మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ మీద విమర్శలు గుప్పించాడు.

ఇది వివాదాస్పదం అయింది. కొందరు దీన్ని రాజకీయం చేశారు. సూర్యను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నీట్’ గురించి, విద్యా విధానం గురించి మాట్లాడే అర్హత సూర్యకు లేదని అన్నారు. దీనికి సూర్య హర్టయ్యాడు. తనను విమర్శించిన వాళ్లకు సమాధానం ఇస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు.

తనకు ఈ విషయంపై మాట్లాడే అర్హత లేదని అనడం తననెంతో బాధించిందన్నాడు. ఒక భారత పౌరుడిగా దేని గురించైనా స్పందించే హక్కు తనకు ఉందన్నాడు. సమాజానికి చేటు చేసే అంశాల గురించి ఎవరైనా మాట్లాడొచ్చన్నారు. విద్యార్థులకు సమస్యగా మారిన సమస్య గురించి మాట్లాడితే ఎలా తప్పవుతుందని ప్రశ్నించాడు. తాను ఇలాగే గళం విప్పుతానని స్పష్టం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో సూర్యకు మద్దతు లభిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English