హైదరాబాద్ పోలీసులా మజాకా

హైదరాబాద్ పోలీసులా మజాకా

రామ్ గోపాల్ వర్మ మహా తెలివైనోడు. మాటకారి. ఎవరికైనా పంచులు వేస్తాడు. ఎవరి గాలైనా తీస్తాడు. కాకపోతే తనకు మాత్రమే ఈ విద్య తెలుసనుకుని.. ఎదుటి వాళ్లను తక్కువగా వేసి అప్పుడప్పుడూ బుక్ అయిపోతుంటాడు. తాజాగా ఆయనకు హైదరాబాద్ పోలీసులు మామూలుగా పంచ్ ఇవ్వలేదు.

తన శిష్యుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయిన నేపథ్యంలో వర్మ హడావుడి మామూలుగా లేదు. సినిమా రిలీజైనప్పటి నుంచి పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నాడు. శనివారం బైకు మీద హల్‌చల్ చేస్తూ హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌కు రావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

వచ్చేవాడు మామూలుగా రాకుండా ట్రిపుల్ రైడింగ్‌తో వచ్చాడు. దీన్ని ఎవరో ఫొటో తీస్తే.. ఆ ఫొటో షేర్ చేసి.. పోలీసులు ఏమయ్యారు.. లోపల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూస్తున్నారేమో అంటూ పంచ్ వేశారు.

దీనికి హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెంట్ లేనందుకు ఫైన్ వేస్తూ చలానా రెడీ చేశారు. సదరు బైక్ యజమానికి పంపారు. ఐతే ఊరికే ఫైన్ వేసి ఊరుకుంటే విశేషం ఏముంది? వర్మకు రివర్స్ పంచ్ కూడా ఇచ్చారు. మమ్మల్ని అలర్ట్ చేసే విషయంలోనే కాక.. రూల్స్ ఫాలో అయ్యే విషయంలో కూడా బాధ్యతాయుతంగా ఉండండంటూ వర్మను హెచ్చరించారు.

ఇక పోలీసులు లోపల సినిమా చూస్తున్నారేమో అనే వర్మ పంచ్‌కు బదులుగా.. మేం సినిమానే చూడాలా.. బయట ఇలాంటి డ్రామాలు, సర్కస్‌లు రోడ్ల మీద చాలా చూస్తుంటాం అంటూ కౌంటర్ వేశారు. అంటే వర్మ చేసిన పబ్లిసిటీ కోసం వర్మ చేసిన డ్రామా, సర్కస్ ఫీట్ల గురించి పరోక్షంగా గట్టిగానే ఆయనకు పంచ్ ఇచ్చారన్నమాట.

ఈ విషయం అర్థమైనప్పటికీ దానికి బదులివ్వలేక.. ఇలా తనకు ఫైన్ వేసిన పోలీసుకి తనకు రెండో కూతురు ఉంటే ఇచ్చి పెళ్లి చేసేవాడినంటూ ఇష్యూను  డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English