ఎలాంటి హీరో ఎలా అయిపోయాడు!

ఎలాంటి హీరో ఎలా అయిపోయాడు!

విక్రమ్‌ సినిమా వస్తుందంటే తెలుగు స్టార్‌ హీరోల చిత్రాలకి ఎగబడినట్టుగా ఎగబడేవారు. అతని అనువాద చిత్రాలకి కూడా ఇక్కడ విపరీతమైన మార్కెట్‌ వుండేది. ఐ సినిమా సంక్రాంతికి వస్తుందంటే తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాలని దానికి పోటీగా విడుదల చేయడానికే భయపడ్డారు. అలాంటి విక్రమ్‌ చాలా త్వరగా తన మార్కెట్‌ కోల్పోయాడు. చివరకు అనువాదమయిన అతని సినిమాలు కొన్ని ఇక్కడ విడుదల చేయలేదు. మిస్టర్‌ కెకె చిత్రానికి అయితే కనీసపు బజ్‌ కూడా రాలేదు. థియేటర్లు దొరక్క సింగిల్‌ స్క్రీన్స్‌లో ఒకటి, రెండు షోలు ఇచ్చినా ఫర్వాలేదని బయ్యర్లు బతిమాలుకున్నారు.

మిస్టర్‌ కెకె చిత్రానికి వస్తోన్న వసూళ్లని చూసి ఇక విక్రమ్‌ చిత్రాలని అనువదించడానికి కూడా ఎవరూ ముందుకు రారనే అనుమానాన్ని ట్రేడ్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆనందకర విషయం ఏమిటంటే ఈ చిత్రం ఒరిజినల్‌ అయిన కదరం కొండన్‌కి మాత్రం మంచి ఓపెనింగ్‌ వచ్చింది. ఈ చిత్రానికి అక్కడ మంచి టాక్‌ కూడా వినిపిస్తోంది. కానీ విక్రమ్‌ తెలుగు వారిని మాత్రం ఆకట్టుకోవడంలో మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. తమిళ హీరోలు చాలా మందిలానే విక్రమ్‌ కూడా తెలుగునాట సంపాదించిన మార్కెట్‌పై ఆశలు వదిలేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English