పూరీ... ఎందుకింత అతి?

పూరీ... ఎందుకింత అతి?

పూరి జగన్నాధ్‌ పని అయిపోయిందనుకుంటోన్న టైమ్‌లో మళ్లీ ఒక హిట్‌ ఇవ్వడం అతనికి అలవాటే. గతంలో పోకిరి, బిజినెస్‌మేన్‌, టెంపర్‌ టైమ్‌లో కూడా పూరీ డౌన్‌లోనే వున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్‌ శంకర్‌తో బౌన్స్‌బ్యాక్‌ అయ్యాడు. అయితే గతంలో ఫెయిల్యూర్‌లో వున్నా, సక్సెస్‌లో వున్నా పూరీ ఎప్పుడూ హద్దు మీరి మాట్లాడలేదు. వర్మ స్కూల్‌కి చెందినవాడే అయినా కానీ కాంట్రవర్సీలని తెగేదాకా లాగకపోవడం అతని తత్వం. కానీ మహేష్‌ హిట్స్‌ తీసే దర్శకులతోనే సినిమాలు చేస్తాడని, ఈసారి అతను చేస్తానని వచ్చినా కానీ తాను చేయనని, ఎందుకంటే తనకి క్యారెక్టర్‌ వుందని నోరు జారాడు. నిజంగా పూరి అంత గొప్పగా ఫామ్‌లోకి వచ్చేసాడా? ఇస్మార్ట్‌ శంకర్‌ని చూసి తను తీసిన సినిమా అంటూ గర్వపడవచ్చా? అది అతని ఇష్టం.

కానీ ఈ సినిమా వరకు కమర్షియల్‌ సక్సెస్‌ మినహా దర్శకుడిగా అతని ఖ్యాతిని పెంచేదేమీ కాదనేది సత్యం. ఈ సినిమా చూసి స్టార్‌ హీరోలు తనకోసం క్యూ కట్టేస్తారనుకోవడం కూడా అవివేకం. ఇకపోతే ఈ సక్సెస్‌ పేరు చెప్పి పూరి టీమ్‌ హద్దులు మీరి అతి చేస్తున్నారు. ఛార్మి అసలు ఆనందం పట్టలేకపోతోంటే మరోసారి వర్మ 'కేవ్‌'లో చేరిపోయాడు. వర్మ రంగంలోకి దిగాక ఆ అతి ఎలాగుంటుందనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పూరికి హిట్‌ వచ్చిందని ఆనందపడే అతని అభిమానులు కూడా ఈ సైడ్‌ బ్యాచ్‌ చేస్తోన్న అతిని చూసి తిట్టుకుంటున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English