ఇంకో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నట్లేనా?

ఇంకో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నట్లేనా?

దాదాపు దశాబ్దంన్నర నుంచి హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు విక్రమ్. ఈ పదిహేనేళ్లలో ఆయన్నుంచి రెండంకెల సంఖ్యలో సినిమాలొచ్చాయి. ఎన్ని ఫ్లాపులు తీసినా.. ఎంత మార్కెట్ పడిపోయినా.. పేరున్న దర్శకులు, నిర్మాతలు ఏరికోరి ఆయనతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ ఫ్లాపుల పరంపరం ఆగట్లేదు.

ఐతే విక్రమ్ కొత్త సినిమా ‘మిస్టర్ కేకే’ ట్రైలర్ చూసి ఈసారి అతను సక్సెస్ రుచి చూస్తాడేమో అనుకున్నారు. ట్రైలర్ అయితే భలేగా కట్ చేశారు. ఇదొక ఇంటెన్స్.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. కానీ సినిమాలో అంత విషయం లేదని తొలి షోతోనే తేలిపోయింది.ఇది బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ టైపు సినిమాగా చూసిన వాళ్లు చెబుతున్నారు.

స్టైల్ ఓవర్ సబ్‌స్టన్స్ అని కొన్ని సినిమాల విషయంలో క్రిటిక్స్ అంటుంటారు. ‘మిస్టర్ కేకే’ ఆ కోవకు చెందిన సినిమానే. విక్రమ్ మేకోవర్.. అతడి లుక్స్.. కొన్ని యాక్షన్ సీన్లు.. స్టైలిష్ టేకింగ్ తప్పితే అసలు విషయం బలహీనంగా ఉండటంతో రెండు గంటల నిడివితో ఉన్న సినిమాను కూడా భారంగా ఫీలవుతున్నారు ప్రేక్షకులు. తెలుగులో అసలే ఈ చిత్రానికి బజ్ తక్కువగా ఉంది. ఓపెనింగ్స్ సరిగా లేవు. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో రిలీజ్ ఖర్చులుు కూడా వెనక్కి వచ్చేలా లేవు.

తమిళంలో కూడా ఈ చిత్రానికి ఏమంత మంచి స్పందన లేదు. తన శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో రాజీ లేకుండా బాగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్‌కు పంచ్ పడేలా ఉంది. దీనికి పోటీగా రిలీజైన అమలా పాల్ సినిమా ‘ఆడై’కి మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఐతే ఈ చిత్రానికి ఫైనాన్స్ సమస్యల కారణంగా తెలుగులో తొలి రోజు షోలు పడలేదు. శనివారం రిలీజైంది. 

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English