పూరీ సార్.. ఈ క్వాలిటీతో ఎలా ఒప్పుకుంటారు?

పూరీ సార్.. ఈ క్వాలిటీతో ఎలా ఒప్పుకుంటారు?

పూరి జగన్నాథ్ ఇప్పుడు మాంచి ఫైర్ మీదున్నాడు. లేక లేక ఒక హిట్టొచ్చేసరికి ఆయన్ని పట్టడం కష్టమవుతోంది. మహేష్ బాబుతో సినిమా గురించి అడిగితే.. నేను హిట్టు కొడితేనే మహేష్ నాతో సినిమా చేస్తాడంటూ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి మహేష్ బాబు కళ్లు హిట్ డైరెక్టర్ల మీద ఉంటాయనే విమర్శలో కొంత వరకు నిజం ఉంది. కానీ పూరి విషయంలో మాత్రం అతను అలా చేయలేదు.

పూరి హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్నపుడే ‘పోకిరి’ చేశాడు. ఆ తర్వాత ఇంకో మూడు ఫ్లాపులతో అల్లాడుతున్న సమయంలోనే ‘బిజినెస్ మేన్’ ఓకే చేశాడు. ఐతే రెండు సార్లూ పూరితో మహేష్ సినిమా ఏంటి అన్న వాళ్లే ఎక్కువమంది. కానీ మహేష్ నమ్మి సినిమా చేశాడు హిట్లు కొట్టాడు. కానీ ‘బిజినెస్ మేన్’ తర్వాత పూరి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. నాసిరకం సినిమాలు తీశాడు.

‘లోఫర్’, ‘పైసా వసూల్’, ‘రోగ్’, ‘మెహబూబా’ లాంటి సినిమాలు ఆయన పతనానికి నిదర్శనంగా నిలిచాయి. ఆయన రాతలో, తీతలో పూర్తిగా క్వాలిటీ పడిపోయింది. ఇలాంటి సినిమాలు తీశాక పూరిని ఏ స్టార్ హీరో  అయినా ఎందుకు నమ్మాలి? ఒక హిట్ దర్శకుడు ఫ్లాపుల్లో ఉన్న హీరోను నమ్మొచ్చు. ఎందుకంటే సినిమాను డీల్ చేసేది తాను కాబట్టి. కానీ దర్శకుడి దగ్గర విషయం అయిపోయిందని హీరోకు డౌట్ ఉంటే ఎలా ఒప్పుకుంటాడు? సినిమా సినిమాకూ క్వాలిటీ పడిపోతుంటే ఎలా నమ్మి సినిమా చేస్తాడు? ఫామ్ సంగతి అలా ఉంచుదాం. పూరి బ్రహ్మాండం అంటున్న ‘జనగణమణ’ స్క్రిప్టు మహేష్‌కు నచ్చి ఉండకపోవచ్చు. తనకది సరైన సినిమా కాదని ఫీలై ఉండొచ్చు.

అంతమాత్రాన ఎంతసేపూ మహేష్ మీద పడి ఏడిస్తే ఎలా? స్క్రిప్టులో దమ్ముందనుకుంటే ఇంకో హీరోతో ఆ సినిమా చేయొచ్చు కదా? ఇంతకుముందు చిరు ‘ఆటో జానీ’ విషయంలో పాజిటివ్‌‌గా స్పందించలేదని.. ఆయన మీదా తన ఫ్రస్టేషన్ చూపించేశాడు పూరి. తాను తీస్తున్న సినిమాల్ని.. తన స్క్రిప్టుల్ని సమీక్షించకుండా హీరోల్ని నిందిస్తే ఏం లాభం? అసలు ఇప్పుడు పూరి అత్యుత్సాహానికి కారణమవుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా అద్భుతమైన సినిమానా? పూరి గత సినిమాల కంటే కాస్త బెటర్. ఏదో  కాలం కలిసొచ్చి వసూళ్లు వస్తున్నాయి. అంతమాత్రాన తానేదో క్లాసిక్ తీసినట్లు ఫీలైపోతే ఎట్టా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English