తమిళ తెరపై తెలుగమ్మాయి హవా

తమిళ తెరపై తెలుగమ్మాయి హవా

ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న కథానాయిక ఎవరు? నయనతార..? సమంత..? తమన్నా..? పూజా హెగ్డే..? రష్మిక మందన్నా..? రకుల్ ప్రీత్..? కానీ వీళ్లెవ్వరూ కాదు. ఆ హీరోయిన్ పేరు ఐశ్వర్య రాజేష్. అవును.. మన తెలుగమ్మాదే ఇప్పుడు హవా అంతా. పైన చెప్పుకున్న హీరోయిన్ల మాదిరి కేవలం పెద్ద సినిమాలు మాత్రమే చేయట్లేదామె. చిన్న, మీడియం, పెద్ద.. ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ నటిస్తోంది. అన్నీ కలిపి ప్రస్తుతం ఐశ్వర్య నటిస్తున్న సినిమాల సంఖ్య ఏకంగా 11 కావడం విశేషం.  ఇందులో తమిళ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆమె అరడజనుకు పైగా సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాలు మూడు. మలయాళంలోనూ ఐశ్వర్యకు సినిమాలున్నాయి.

తమిళంలో ‘భారతీయుడు-2’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో ఐశ్వర్యకు ఛాన్స్ లభించినట్లు సమాచారం. తెలుగులో త్వరలోనే ఆమె తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ విడుదల కాబోతోంది. ఇది తమిళంలో ఐశ్వర్యనే కథానాయికగా నటించిన ‘కనా’కు రీమేక్. దీంతో పాటు ‘మిస్ మ్యాచ్’ అనే సినిమాలో కథానాయికగా చేస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కతున్న చిత్రంలోనూ ఐశ్వర్య ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. ఇలా దక్షిణాదిన మూడు భాషల్లో ఐశ్వర్య హవా సాగుతోంది. తెలుగులో 80వ దశకంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన రాజేష్ కూతురే ఈ ఐశ్వర్య. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మాయి.. అక్కడే సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ‘కాకముట్టై’ అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీలో ఇద్దరు పిల్లల పేద తల్లిగా ఆమె నటన ప్రశంసలందుకుంది. అక్కడి నుంచి ఆమెకు అవకాశాలు పెరిగాయి. అందం కంటే అభినయానికి ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఐశ్వర్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English