మహేష్‌ గురించి పూరి షాకింగ్ కామెంట్స్

మహేష్‌ గురించి పూరి షాకింగ్ కామెంట్స్

దర్శకుడు హిట్లలో ఉంటేనే మహేష్ బాబు సినిమా చేస్తాడంటూ అప్పట్లో డైరెక్టర్ తేజ ఒక కామెంట్ చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘జయం’ లాంటి బ్లాక్ బస్టర్‌ ఇచ్చిన సమయంలో తేజతో ‘ నిజం’ చేశాడు మహేష్. మళ్లీ తేజ అడిగితే సినిమా చేయనన్నాడో ఏమో తెలియదు కానీ.. ఆ కామెంట్ వచ్చింది తేజ నోటి నుంచి. ఐతే తేజ అలా అనడం సబబుగానే అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ సైతం అదే వ్యాఖ్య చేయడం కలకలం రేపుతోంది. పూరి అంటే మహేష్ అభిమానులకు చాలా ఇష్టం. తమ హీరోకు ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్.. ‘బిజినెస్ మ్యాన్’ లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టే ఆ అభిమానం. మళ్లీ వీళ్ల కలయికలో ‘జనగణమణ’ గురించి చాలా చర్చ నడిచింది. కానీ స్క్రిప్టుతో పూరి రెడీగా ఉన్నా.. మహేష్ మాత్రం ఓకే అన్నట్లు లేడు.

ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి తన అసహనాన్ని చూపించిన పూరి.. తాజాగా మరోసారి మహేష్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ కొట్టిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆయన్ని పలకరిస్తూ మహేష్‌తో మళ్లీ ఓ సినిమా తీయమన్నారు. దానికి పూరి బదులిస్తూ.. ‘‘మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశాననే ప్రేమతో మరో సినిమా చేయమని అభిమానులు అడుగుతుంటారు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాళ్ల కోసం చెబుతున్నా.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు’’ అనేశాడు పూరి. ఐతే పూరి ఆవేశంతో ఈ మాట అని ఉండొచ్చు కానీ.. నిజానికి మహేష్ పూరి హిట్లు కొట్టినపుడు అతడితో సినిమా చేయలేదు. పూరితో చేసే రెండు సినిమాల ముందు ఆయన ఫ్లాపుల్లోనే ఉన్నాడు. ‘పోకరి’కి ముందు పూరి తీసిన ‘ఆంధ్రావాలా,’‘143’, ‘సూపర్’ డిజాస్టర్లయ్యాయి. ‘బిజినెస్ మేన్’కు ముందు ‘ఏక్ నిరంజన్’, ‘గోలీమార్’, ‘నేను నా రాక్షసి’ లాంటి ఫ్లాపులిచ్చాడు పూరి. మరి తాను హిట్ మీద ఉన్నపుడే మహేష్ సినిమా చేస్తాడని పూరి ఎలా అంటాడు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English