అనిల్ అలా.. జగపతి ఏమో ఇలా..

అనిల్ అలా.. జగపతి ఏమో ఇలా..

మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు తప్పుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ముందు చెప్పినట్లుగా తన పాత్ర లేకపోవడం, ప్రాధాన్యం తగ్గించేయడంతో హర్టయి జగపతిబాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.

ఐతే ఈ వ్యవహారం వివాదం కాకుండా కవర్ చేసే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. జగపతిబాబు చాలా ప్రేమించి.. ఆసక్తి చూపించిన పాత్ర ఇదని.. కొన్ని కారణాల వల్ల జగపతిబాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని.. తమ ఇబ్బందుల్ని ఆయన అర్థం చేసుకున్నారని అన్నాడు అనిల్. ఐతే జగపతిబాబు సైతం ఈ వివాదంపై వివరణ ఇవ్వగా.. ఆయన వెర్షన్ పూర్తి భిన్నంగా ఉంది.

మహేష్ సినిమా నుంచి తప్పుకోవడంపై ఒకింత ఆవేదన స్వరంతోనే మాట్లాడాడు జగపతి. మహేష్ సినిమా కోసం తాను వేరే చిత్రాలు రెండు వదులుకున్నట్లు జగపతి వెల్లడించాడు. తన 33 ఏళ్ల కెరీర్లో ఇలా ఓ సినిమా గురించి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఇదే తొలిసారని... తాను మహేష్ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలోో రకరకాల ఊహాగానాలు వస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వివరణ ఇచ్చుకుంటున్నట్లు జగపతి చెప్పాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో తనకిచ్చిన పాత్ర ఇప్పటికీ తనకు ఇష్టమే అని.. చేయడానికి రెడీగా ఉన్నానని జగపతి స్పష్టం చేశాడు.

మహేష్ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకోవడం నిజమని.. ఐతే ఇండస్ట్రీలో కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని జరుగుతాయని.. ఆ పరిస్థితి వల్ల సినిమాకు దూరం కావాల్సి వచ్చిందని నర్మగర్భంగా మాట్లాడారు జగపతి. మరి జగపతి ఇంకా తాను ఆ పాత్ర చేయడానికి రెడీ అంటున్న నేపథ్యంలో అనిల్ అండ్ టీం ఆయనకు వెల్కమ్ చెబుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English