టాలీవుడ్ కొత్త ఏజెంట్.. నక్కతోక తొక్కినట్లున్నాడే

టాలీవుడ్ కొత్త ఏజెంట్.. నక్కతోక తొక్కినట్లున్నాడే

సినీ పరిశ్రమలో ఫస్ట్ బ్రేక్ కోసం చాలా ఏళ్లు పోరాడాల్సి ఉంటుంది. కానీ సరైన సక్సెస్ వచ్చిందంటే మాత్రం రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతుంటాయి. ఈ ఆశతోనే ఏళ్లకు ఏళ్లు కష్టపడుతుంటారు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. నవీన్ పొలిశెట్టి అనే టాలెంటెడ్ యాక్టర్ కూడా చాలా కాలం బ్రేక్ కోసం ఎదురుచూశాడు.

చివరికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రూపంలో అతను కోరుకున్న విజయం వచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిన్న సినిమా అనూహ్య విజయం సాధించింది. నవీన్ టాలెంట్ ఏంటో సినిమాతో అందరికీ అర్థమైంది. ఇప్పుడతడికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ అతను హీరోగా మరో సినిమా మొదలైపోయిందట. ఇంతకుముందు ‘పిట్టగోడ’ అనే ప్రేమకథ తీసిన అనుదీప్ డైరెక్షన్లో నవీన్ ఈ సినిమా చేస్తున్నాడట.

దీంతో పాటు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వైజయంతీ మూవీస్‌లో నవీన్ సినిమా ఒకటి ఓకే అయింది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇంకో రెండు పేరున్న బేనర్లలో నవీన్‌కు సినిమాలు ఓకే అయినట్లు సమాచారం. చూస్తుంటే తన స్నేహితుడైన విజయ్ దేవరకొండ లాగే నవీన్ సైతం ఫుల్ బిజీ అయిపోయేట్లు కనిపిస్తున్నాడు.

ఇలాంటి ప్రామిసింగ్ నటులు కనిపిస్తే పెద్ద నిర్మాణ సంస్థలు వెంటనే అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్లు తీసుకుంటున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సహా ‘ఆత్రేయ’ రిలీజ్ తర్వాత స్పెషల్ షో చూసిన సెలబ్రెటీలు.. నవీన్ భవిష్యత్తులో చాలా బిజీ అవుతాడని, పెద్ద స్థాయికి ఎదుగుతాడని అన్నారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English