పూరీ సారూ.. ఇదే లాస్ట్ ఛాన్స్

 పూరీ సారూ.. ఇదే లాస్ట్ ఛాన్స్

ఒక దర్శకుడి మీద ప్రేక్షకుల్లో భయంకరమైన గురి కుదిరాక.. అతడిపై నమ్మకం అంత సులువుగా పోదు. అలాంటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. గురువు రామ్ గోపాల్ వర్మ స్టయిల్లోనే ట్రెండ్ క్రియేట్ చేస్తూ సెన్సేషనల్ హిట్లు ఇచ్చాడు పూరి ఒకప్పుడు. కానీ అదంతా గత వైభవం కింద మిగిలిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయన ఇచ్చిన ఏకైక హిట్టు.. టెంపర్.

అది సొంత కథ కాకపోవడంతో పూర్తి క్రెడిట్ తనకు దక్కలేదు. ‘టెంపర్’ తర్వాత డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇచ్చి తన మీద అభిమానులు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా చేశాడు. ఇండస్ట్రీ జనాల్లోనూ ఆయనపై భరోసా పోయింది. రామ్ లాంటి మీడియం రేంజి హీరో కూడా ఒక పట్టాన సినిమాను ఒప్పుకోకపోవడం పూరి క్రెడిబిలిటీ ఎలా దెబ్బ తినేసిందో చెప్పడానికి ఉదాహరణ.

చివరికి ఎలాగోలా రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని తెరకెక్కించాడు పూరి. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్, ట్రైలర్‌కు వచ్చిన నెగెటివిటీ చూస్తే సినిమాపై జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందో అనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చింది. బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి. పూరి ఒకప్పటి వైభవాన్ని గుర్తుకు చేస్తున్నాయి బుకింగ్స్. ప్రేక్షకులు ఆయనకు మరొక్క అవకాశం ఇద్దామని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది.

మరి ఈసారైనా పూరి తన పవర్ చూపిస్తాడా లేదా అన్నది ఆసక్తికరం. ఈ సినిమాతో సత్తా చాటితో మళ్లీ బాలయ్య అవకాశమిచ్చినా ఇవ్వొచ్చు. ఇంకో స్టార్ హీరో ఎవరైనా దొరకొచ్చు. కానీ ఇది తేడా వచ్చిందంటే మాత్రం రామ్ కంటే కింది స్థాయి హీరోలు కూడా పూరికి దండం పెట్టేయడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English