అల్లు అరవింద్ మీదే పంచులా?

అల్లు అరవింద్ మీదే పంచులా?

అల్లు అరవింద్ మీద పంచులేయడానికి స్టార్లు కూడా భయపడతారు. ఆయన సరదా మనిషే కానీ.. స్థాయి దృష్ట్యా ఆచితూచి మాట్లాడారు. కానీ యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ మాత్రం స్టేజ్ మీద ఆయనతో పరాచికాలు ఆడేశాడు. పంచులు వేశాడు.

యాటిట్యూడ్ మేటర్స్ ఎవ్రీథింగ్ అన్నట్లుగా ఈ తరం హీరోలందరూ ఒక దారిలో వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. స్టేజ్ మీద రొటీన్ ముచ్చట్లు పెడితే.. జనాలకు అస్సలు ఎక్కట్లేదు. ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేయాలి. పంచ్ ఉండేలా చూసుకోవాలి. ఆ విషయం ‘ఆర్ఎక్స్ 100’ హీరోకు బాగానే అర్థమైనట్లుంది.

తన తర్వాతి సినిమా ‘హిప్పి’కి షర్ట్ విప్పి అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు తన కొత్త సినిమా ‘గుణ 369’ ట్రైలర్ లాంచ్‌లో అతను తన యాటిట్యూడ్ చూపించాడు.

ఈ వేడుకకు అరవింద్‌తో పాటు బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బోయపాటి దగ్గర శిష్యరికం చేసిన అర్జున్ జంధ్యాలనే ‘గుణ 369’ దర్శకుడు. ‘గీతా ఆర్ట్స్’లో బోయపాటి తీసిన ‘సరైనోడు’కు అతను పని చేశాడట. ఈ నేపథ్యంలో కార్తికేయ మాట్లాడుతూ.. వీళ్లంతా కలిసి చేసిన ‘సరైనోడు’ను మించి ‘గుణ 369’ పెద్ద హిట్ అవుతుందంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు కార్తికేయ.

అంతలోనే తడుముకుని పంచ్ బాగుందని ఈ మాట అన్నానని అన్నాడు. తర్వాత బోయపాటితో ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ ఇంకో చేయబోతున్నట్లు అరవింద్ చెబుతుంటే.. మధ్యలో కలగజేసుకున్న కార్తికేయ.. అందులో హీరో నేనేనా సార్ అన్నాడు. అరవింద్ లాంటి వాడితో ఓ యంగ్ హీరో ఇలా చమత్కారాలు ఆడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే అరవింద్ మాత్రం దీన్ని సరదాగానే తీసుకుని ‘వెల్కమ్ టు గీతా ఆర్ట్స్’ అంటూ అతడికి ఆహ్వానం పలకడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English