అందరూ నాగ్‌ వలే ఆలోచిస్తే...

అందరూ నాగ్‌ వలే ఆలోచిస్తే...

టాలీవుడ్‌లో టాప్‌ ఫిల్మీ ఫ్యామిలీస్‌ ఎన్ని ఉన్నా అక్కినేని కుటుంబం వేరు. అలాగే అగ్ర హీరోలెందరు ఉన్నా ..వీరిలో అక్కినేని నాగార్జున వేరు. తన కుటుంబం నుంచి వచ్చిన హీరోల సక్సెస్‌ కోసం తను ఆలోచించినంతగా, వేరే ఏ హీరో వారి వారస హీరోల గురించి ఆలోచించరు. సుమంత్‌ కెరీర్‌ ఆరంభంలోనే ఎన్నో ఒడిదుడుకులలో కూరుకుపోయినప్పుడు నాగ్‌ నేనున్నానంటూ తనకి అండగా నిలిచాడు. ‘సత్యం’ అనే బ్లాక్‌బస్టర్‌ని నిర్మించి కెరీర్‌నిచ్చాడు.

అలాగే సుశాంత్‌ని నిలబెట్టడానికి ‘కరెంట్‌’, ‘కాళిదాసు’ సినిమాలకు పెట్టుబడులు సమకూర్చాడు. ఇప్పుడు తనయుడు నాగచైతన్య ‘తడాఖా’కి ముందు కొన్ని సినిమాలు నిర్మించి స్ట్రగుల్స్‌ అన్నీ తనే బేర్‌ చేశాడు. ఇప్పుడు ‘ఆటోనగర్‌ సూర్య’ని పట్టాలెక్కించడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. అందుకోసం ఓ నిర్మాతతో జట్టుకట్టాడు. ఇదంతా కేవలం ఒక్క నాగ్‌ వల్ల మాత్రమే సాధ్యం.

 మిగతా బిగ్‌ ఫ్యామిలీస్‌లో వారస హీరోలు ఉన్నా వారిగురించి ఆలోచించే పెద్దన్న హీరో లేనే లేరు. అలాకాకుండా అంతా నాగ్‌లా ఆలోచిస్తే ఒక్కో కుటుంబం నుంచి నలుగురైదుగురు హీరోలు సర్వైవ్‌ కావొచ్చు. వారసులంతా వరుస ప్లాపుల పాలైతే, ఆదుకునే దిక్కులేక వీరంతా కనుమరుగు కావొచ్చు. అప్పుడు లెగసీల గురించి మాట్లాడడానికి ఎవరూ ఉండరు. అసలు ఆ వంశాల పేర్లు ఎత్తే నాదుడే ఉండడు. మిగతావాళ్లు నాగ్‌ని చూసైనా నేర్చుకుంటే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు