అఫీషియల్: మళ్లీ గీతా ఆర్ట్స్‌లో బోయపాటి

అఫీషియల్: మళ్లీ గీతా ఆర్ట్స్‌లో బోయపాటి

పెద్ద హిట్లిచ్చినా.. మంచి సక్సెస్ రేట్ ఉన్నా.. చాలాకాలం బోయపాటి శ్రీనును టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తించలేదు టాలీవుడ్. అలాంటి సమయంలో గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం డివైడ్ టాక్‌ను కూడా తట్టుకుని బ్లాక్ బస్టర్ అయింది. బోయపాటి స్థాయిని పెంచింది. టాప్ డైరెక్టర్ల లీగ్‌లో చేర్చింది.

ఐతే దీని తర్వాత అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. మెగా కాంపౌండ్లోని మరో పెద్ద హీరో రామ్ చరణ్‌తో బోయపాటి తీసిన ‘వినయ విధేయ రామ’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా చూశాక ఇక పెద్ద హీరోలెవ్వరూ అతడితో పని చేయరేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. ఐతే ఇప్పుడు మళ్లీ బోయపాటితో గీతా సంస్థ ఒక సినిమాకు సన్నాహాలు చేస్తుండటం విశేషం. అందులో హీరో ఎవరన్నది తెలియదు. ఐతే తమ బేనర్లో బోయపాటి సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు అల్లు అరవిందే స్వయంగా ప్రకటించాడు.

కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బోయపాటితో కలిసి పాల్గొన్న అరవింద్.. అతడి గురించి మాట్లాడే క్రమంలో ఈ విషయం తెలిపాడు. చిరంజీవితో బోయపాటి సినిమా అంటూ ఎప్పట్నుంచో ఒక ప్రచారం నడుస్తోంది. ఐతే ‘వినేయ విధేయ రామ’ ఫలితం తర్వాత ఈ ప్రచారానికి తెరపడింది. అరవింద్ మాటల్ని బట్టి చూస్తే చిరు-బోయపాటి కలయికలో రాబోయే చిత్రాన్ని ఆయన నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English