ఆ లెజెండ్ క్యాన్సర్ వల్ల 26 కిలోలు తగ్గాడట

ఆ లెజెండ్ క్యాన్సర్ వల్ల 26 కిలోలు తగ్గాడట

లిసారే.. మమతా మోహన్ దాస్.. సోనాలి బింద్రే.. ఇలా క్యాన్సర్ బారిన పడి అభిమానులకు వేదన కలిగించిన సెలబ్రెటీలు ఎందరో. కొన్ని నెలల కిందటే ఈ జాబితాలోకి చేరి అభిమానుల్ని విషాదంలోకి నెట్టాడు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్. ఎప్పుడూ చీర్‌ఫుల్‌గా కనిపించే  ఆయన క్యాన్సర్ బారిన పడ్డట్లు తెలియడం బాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది.

రిషి కొన్ని నెలలుగా న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  మధ్యలో ఒకట్రెండుసార్లు సామాజిక మాధ్యమాల్లో అప్ డేట్ ఇవ్వడం మినహా తాను క్యాన్సర్ బాధితుడిని కావడంపై ఏమీ మాట్లాడని రిషి.. తాజాగా ఒక ఇంగ్లిష్ మీడియా సంస్తకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనకు క్యాన్సర్ ఎలా బయటపడింది.. చికిత్స సందర్భంగా ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు.

‘‘గత ఏడాది దిల్లీలో ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు నేను వైద్య పరీక్షలు చేయించుకున్న ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడే నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది. ఆ తర్వాత తొమ్మిది నెలలుగా న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. జీవితంలో పెను మార్పు చోటుచేసుకున్నట్లు అనిపిస్తోంది. చికిత్స మొదలుపెట్టాక ఒక దశలో 26 కిలోలు తగ్గిపోయాను. నాలుగు నెలల పాటు తిండిలేదు. ఆకలి వేసేది కాదు. ఈ మధ్యనే కాస్త కోలుకుని తింటున్నా. ఎనిమిది కిలోలు పెరిగాను. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం మెరుగవుతోంది. ఇంకా చికిత్స జరుగుతోంది. నా ఇంటిని చాలా మిస్సవుతున్నాను. నేను న్యూయార్క్‌లో మరో రెండు నెలలు చికిత్స తీసుకోవాలి. సెప్టెంబర్‌లో నా పుట్టినరోజు. కనీసం అప్పటికైనా నేను నా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నా’’ అని రిషి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English