‘పోకిరి’ రీమేక్.. ఖాకీ డ్రెస్ చూసి సల్మాన్ షాక్

‘పోకిరి’ రీమేక్.. ఖాకీ డ్రెస్ చూసి సల్మాన్ షాక్

పుష్కర కాలం కిందట సల్మాన్ కెరీర్ అయోమయంగా ఉండేది. వరుస ఫ్లాపులతో అతను మిగతా హీరోలతో రేసులో వెనుకబడిపోయాడు. అలాంటి సమయంలో అతడి కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసిన సినిమా ‘వాంటెడ్’. ఇది తెలుగు ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఐతే ‘పోకిరి’ సినిమా పూర్తిగా చూడకుండానే సల్మాన్ ఈ రీమేక్‌కు ఒప్పుకున్నాడట. ఈ చిత్రంలో హీరో పాత్ర అండర్ కవర్ పోలీస్ అనే సంగతి తెలియకుండానే అతను షూటింగుకి కూడా వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని ‘పోకిరి’ దర్శకుడైన పూరి జగన్నాథ్ వెల్లడించడం విశేషం.

‘పోకిరి’ని తమిళంలో రీమేక్ చేసిన ప్రభుదేవానే హిందీలో కూడా తీసిన సంగతి తెలిసిందే. ఐతే హిందీ రీమేక్ గురించి తనకంతా తెలుసని.. సల్మాన్ ‘పోకిరి’ సినిమాలోని రెండు సీన్లు చూసి ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడని.. ఐతే షూటింగ్ సందర్భంగా అతడికి పోలీస్ డ్రెస్ తెచ్చి సీన్ కోసం రెడీ అవ్వమంటే.. ఇదెందుకు అని ఆశ్చర్యపోయినట్లు తనకు తెలిసిందని పూరి తెలిపాడు. హీరో పోలీస్ అనే సంగతి అప్పటిదాకా సల్మాన్‌కు తెలియదని పూరి చెప్పాడు.

ఇక ‘పోకిరి’ తీస్తున్నపుడు సినిమా రిలీజ్ రోజు ట్విస్టు రివీల్ అయిపోయాక ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో.. సినిమాను ఆదరిస్తారో లేదో అన్న సందేహాలు ఉండేవని పూరి చెప్పాడు. అయితే విడుదలకు ముందు సినిమాలో మహేష్ పోలీస్ అనే సంగతి తెలియకుండా ఉండటం కోసం పోలీస్ డ్రెస్సులో తీసిన సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్త పడ్డామని.. స్టిల్ ఫొటోగ్రాఫర్‌ను కూడా సెట్‌కు రానివ్వలేదని పూరి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English