‘సాహో’ నిర్మాతలు మారరా?

 ‘సాహో’ నిర్మాతలు మారరా?

‘సాహో’ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చే విషయంలో, షెడ్యూల్స్ ప్లాన్ చేయడంలో, ప్రమోషన్లలో.. ఇలా చాలా విషయాల్లో యువి క్రియేషన్స్ వాళ్ల పనితీరు పట్ల ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఒక దశలో యువి వాళ్లకు వ్యతిరేకంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో క్యాంపైనింగ్ నడపడం.. వాళ్ల ఆఫీసు దగ్గరికి గొడవలు చేయడం వరకు పరిస్థితి వెళ్లింది.

ఆ తర్వాత కొంచెం కదలిక వచ్చి ‘సాహో’ మేకింగ్ వీడియోలు వదలడం.. పోస్టర్లు రిలీజ్ చేయడం లాంటివి చేశారు. ఐతే టీజర్ లాంచ్ తర్వాత వచ్చిన హైప్‌ను కొనసాగిస్తూ సినిమాను సరిగా ప్రమోట్ చేయడం లేదనే విమర్శలు మళ్లీ ప్రభాస్ అభిమానుల నుంచి వచ్చాయి. మ్యూజిక్ విషయంలో నడిచిన సస్పెన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో గందరగోళం గురించి కూడా చాలా నెగెటివిటీ ఎదుర్కొన్నారు యువి క్రియేషన్స్ వాళ్లు. ఐతే సమయానికి సినిమా రిలీజ్ చేస్తే ఇవన్నీ కొట్టుకుపోయేవి.

కానీ ఇంకో నెల రోజుల్లో రిలీజ్ అని ప్రభాస్ అభిమానులు ఊగిపోతున్న సమయంలో వాయిదా వార్త బయటికి వచ్చింది. ఆగస్టు 15కి ‘రణరంగం’, ‘ఎవరు’ సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్న నేపథ్యంలో ‘సాహో’ వాయిదా ఖరారైనట్లే. కానీ వేరే సినిమాలు డేట్లు ప్రకటిస్తే కానీ.. ‘సాహో’ వాయిదా అన్నది తెలియకపోవడమే విచారించాల్సిన విషయం.

ఈ విషయమేదో ‘యువి క్రియేషన్స్’ వాళ్లే అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది కదా? సినిమా ఎందుకు వాయిదా పడుతోందో వివరించి.. తర్వాతి రిలీజ్ డేట్ ఏదో చెప్పి అభిమానుల్ని ఊరడించే ప్రయత్నం చేయొచ్చు కదా? ఒకప్పుడు ‘బాహుబలి’ వాయిదా పడితే రాజమౌళి ఇలాగే సర్దిచెప్పాడు కదా? ఎక్కడో ఫారిన్లో పాట చిత్రీకరణ గురించి అర్థం పర్థం లేని లెంగ్తీ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసిన వాళ్లకు అతి ముఖ్యమైన సమాచారం గురించి అధికారిక ప్రకటన చేసే తీరిక లేకుండా పోయిందా? మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పులే చేస్తుండటంతో ఈ నిర్మాతలు మారరా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా అసహనం చెందుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English