ముద్దిమ్మంటే సినిమా వద్దు పొమ్మందట

ముద్దిమ్మంటే సినిమా వద్దు పొమ్మందట

సినీ పరిశ్రమలో తమకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ పెట్టుకుని.. వాటిని మీరకుండా సాగిపోయే వాళ్లు కొద్దిమందే కనిపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గ్లామర్ క్యారెక్టర్లు చేయను, లిప్ లాక్స్ కుదరదు అని ఈ రోజుల్లో నియమాలు పెట్టుకుంటే కెరీర్ ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది.

కానీ చాలా కొద్దిమంది మాత్రం ఇలా సర్వైవ్ అవుతుంటారు. అందులో సాయిపల్లవి ఒకరు. ఆమె ఇప్పటిదాకా ఏ సినిమాల ఎక్స్‌పోజింగ్ చేసింది లేదు. ప్రతి సినిమాలోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రే చేసింది. ఏదో ఒక ప్రత్యేకత లేనిదో ఆమె సినిమా ఒప్పుకోదు. స్కిన్ షో చేయడానికి ఒప్పుకోని సాయిపల్లవి లిప్ లాక్ అంటే ‘నో.. నెవర్’ అనే అంటుంది.

ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ ప్రిన్సిపుల్ కారణంగా ఆమె ఒక క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కోల్పోయినట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు.. డియర్ కామ్రేడ్ అట.‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది విజయ్ దేవరకొండ-రష్మికల లిప్ లాక్. తాజాగా ట్రైలర్లోనూ ఇద్దరూ పెదవి ముద్దులు బాగానే లాగించారు.

మరి ఆ ప్లేస్‌లో సాయిపల్లవిని ఊహించుకుని చూడండి. ఏదోలా ఉంది కదా? సాయిపల్లవి ఫీలింగ్ కూడా అదే. ముందుగా ఈ చిత్రంలో లిల్లీ పాత్ర కోసం సాయిపల్లవినే సంప్రదించాడట దర్శకుడు భరత్ కమ్మ. కానీ లిప్ లాక్స్ కంపల్సరీ అనడంతో ఆమె ఈ పాత్ర చేయనందట. విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు లిప్ లాక్‌ను నవ్వు లాగే ఒక ఎమోషన్ లాగా చూడాలంటాడు కానీ.. సాయిపల్లవి మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గానే ఉన్నట్లుంది. కథ ప్రకారం చూస్తే సినిమాలో లిప్ లాక్స్ తీయడానికి లేనట్లే కనిపిస్తోంది.

ఆల్రెడీ ‘గీత గోవిందం’లో తన కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేసిన విజయ్-రష్మిక మరోసారి అదరగొట్టినట్లే కనిపిస్తున్నారు కానీ.. విజయ్ లాంటి పెర్ఫామర్‌కు సాయిపల్లవి తోడై ఉంటే ‘డియర్ కామ్రేడ్’కు మరింత ఆకర్షణ వచ్చేదేమో అనిపిస్తోంది. మొత్తానికి లిప్ లాక్స్ ఉన్నాయని ఇంత పెద్ద ప్రాజెక్టు వదులుకుందంటే.. సాయిపల్లవి రూటే వేరని ఒప్పుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English