ఎందుకొచ్చిన ఎలెవన్ సచినూ..

ఎందుకొచ్చిన ఎలెవన్ సచినూ..

ప్రపంచకప్ అయిపోయాక ఓ పక్క ఐసీసీ.. ఇంకోపక్క మాజీ ఆటగాళ్లు.. టోర్నీలో తమ ఫేవరెట్ ఆటగాళ్లతో ‘ప్రపంచకప్ ఎలెవన్’ను ప్రకటించడం మామూలే. ఇవి భలే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఐసీసీ ఆల్రెడీ తమ ఎలెవన్ ప్రకటించింది. అందులో భారత జట్టు నుంచి రోహిత్ శర్మ, బుమ్రాలకు మాత్రమే చోటిచ్చింది.

కోహ్లిని పక్కన పెట్టడం ఒకింత ఆశ్చర్యపరిచినా.. ఒక్క సెంచరీ కూడా చేయని, టోర్నీ టాప్-10 స్కోరర్లో జాబితాలో లేని భారత కెప్టెన్‌ను పక్కన పెట్టడం అసమంజసం ఏమీ కాదు. మరోవైపు కొందరు మాజీలు తమ జట్లను ప్రకటిస్తుండటం చూసి భారత దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్ కూడా తన జాబితాను ప్రకటించాడు. ఐతే 11 మందిలో ఐదుగురు భారతీయులకు చోటివ్వడంతో సచిన్ మీద పడిపోయారు నెటిజన్లు.

స్వయంగా మనవాళ్లే సచిన్ జట్టు ఎంపికను తప్పుబడుతున్నారు. ఇంతకీ సచిన్ జట్టులో చోటు దక్కిన ఐదుగురు ఎవరంటే.. రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్ పాండ్య, జడేజా, బుమ్రా. సెమీఫైనల్ ఒకదాంట్లో రాణించినంత మాత్రాన జడేజాను ఎలా ఎంపిక చేస్తారని చాలామంది ప్రశ్నించారు. హార్దిక్ పాండ్య ఎంపికనూ తప్పుబట్టారు. టోర్నీలో ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి ఎంపికా తప్పే అంటున్నారు. లైఫ్‌ల మీద లైఫ్‌లు వస్తే సెంచరీల మీద సెంచరీలు కొట్టిన రోహిత్‌కు చోటివ్వడాన్ని కూడా కొందరు తప్పుబట్టారు.

ఇదంతా ఒకెత్తయితే.. ధోనికి ఈ టీంలో సచిన్ ప్లేస్ ఇవ్వకపోవడం మీదా ఒక వర్గం మండిపోయింది. ఆల్రెడీ ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్ సందర్భంగా ధోని జిడ్డు బ్యాటింగ్‌ను తప్పుబట్టాడని అతడి మీద పడిపోయారు ధోని ఫ్యాన్స్. ఆ తర్వాత దాన్ని కవర్ చేయడానికి చాలానే ప్రయత్నించాడు మాస్టర్. అయినా వాళ్లు తగ్గ్లలేదు. ఇలాంటి తరుణంలో తన జట్టులో ధోనీని పక్కన పెట్టడం మిస్టర్ కూల్ అభిమానులకు నచ్చలేదు. వాళ్లు మళ్లీ సచిన్‌ను టార్గెట్ చేశారు. మొత్తానికి సౌమ్యుడు, వివాద రహితుడు అయిన సచిన్.. సైలెంటుగా ఉండకుండా ఇలా ప్రపంచకప్ ఎలెవన్ ప్రకటించాడని అంటున్నారు తటస్థులంతా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English