తెలుగోళ్లు ఆదరించట్లేదని ఆవేదన

తెలుగోళ్లు ఆదరించట్లేదని ఆవేదన

రజనీకాంత్, కమల్ హాసన్‌ల తర్వాత తెలుగులో ఆ స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో విక్రమ్ ఒకడు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ సినిమాలతో అతడికి తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది.  కానీ దాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయాడు. మధ్య ‘ఐ’ని మినహాయిస్తే తెలుగులో ఓ మోస్తరుగా ఆడిన విక్రమ్ సినిమా ఏదీ లేదు.

ఐతే ఈ శుక్రవారమే విడుదలవుతున్న తన కొత్త చిత్రం ‘మిస్టర్ కేకే’ ఆ లోటును తీరుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన విక్రమ్.. తెలుగులో తాను మార్కెట్ కోల్పోవడం గురించి మాట్లాడాడు.

తన సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచిన మాట వాస్తవమే అని.. ఐతే ‘స్కెచ్’, ‘సామి-2’ లాంటి సినిమాలకు తమిళంలో బాగానే ఆదరణ దక్కిందని.. తెలుగు ప్రేక్షకులే వీటిని ఆదరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన కొన్ని ప్రయోగాలు ఫలితాన్నివ్వలేదని విక్రమ్ చెప్పాడు. ఐతే తానెప్పుడూ నంబర్ వన్ హీరో కావాలని చూడలేదని.. నటుడిగా సంతృప్తినిచ్చే, ప్రత్యేకమైన పాత్రల వెంటే నడిచానని.. ఈ క్రమంలో ఫలితాలు కొన్నిసార్లు తారుమారయ్యాయని చెప్పాడు.

తనకు హాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినా తిరస్కరించానని.. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లడం కరెక్ట్ కాదనిపించిందని, అదే సమయంలో తనకు ఆఫర్ చేసిన పాత్ర కూడా తనకు ప్రత్యేకంగా అనిపించలేదని విక్రమ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English