సమంత సొంత కుంపటికి కారణం అదే!

సమంత సొంత కుంపటికి కారణం అదే!

సమంత మెయిన్‌ లీడ్‌గా నటించిన సినిమాకి అన్నీ తానే అవుతుంది. అయినా కానీ హీరోలకి ఇచ్చినట్టుగా తనకి పారితోషికం మాత్రం రాదు. సగటు హీరోయిన్‌కి ఎంత ఇస్తారో అంతే ఇస్తారు లేదా లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అంటూ అంతకంటే తక్కువే ఇస్తారు తప్ప ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి అంగీకరించరు. తన సినిమాపై నాన్‌ థియేట్రికల్‌ హక్కులు కలుపుకుని రమారమి పాతిక నుంచి ముప్పయ్‌ కోట్ల వరకు బిజినెస్‌ అవుతోందని సమంతకి తెలుసు. కానీ ఆమెకి వచ్చే పారితోషికం మాత్రం కోటిన్నర లోపే. ఇది ఎప్పటికీ మారదని సమంత అర్థం చేసుకోవడంతో ఆ లాభమేదో తానే చేసుకోవాలని సొంత నిర్మాణ సంస్థ గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది.

నాగచైతన్యకి అన్నపూర్ణ స్టూడియోస్‌లో భాగస్వామ్యం వున్నా కానీ దాంతో సంబంధం లేకుండా తమ సినిమాలు తామే నిర్మించుకోవాలని సమంత సీరియస్‌గా థింక్‌ చేస్తోంది. ఓ బేబీ లాంటి సినిమాలతో పాటు అడపాదడపా తాను, చైతన్య కలిసి నటించే చిత్రాలు కూడా ఇదే బ్యానర్లో చేయాలని, తద్వారా చైతన్యకి, తనకి కూడా మామూలుగా వచ్చే దానికంటే ఎక్కువ పారితోషికం వస్తుందని సమంత భావిస్తోంది. దీనిపై నాగార్జున అభిప్రాయం ఏమిటనేది ఇంకా తెలియదు మరి. ఇప్పటికే తన ఫ్యామిలీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్థాపించిన నాగ్‌ తన కొడుకు కోసం మరో బ్యానర్‌ అంటే ఒప్పుకుంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English