సోషల్‌ మీడియా ట్రాప్‌లో హీరోయిన్లు

సోషల్‌ మీడియా ట్రాప్‌లో హీరోయిన్లు

ట్రెండింగ్‌ టాపిక్‌పై తమ అభిప్రాయం చెప్పకపోతే ఎక్కడ వెనుకబడిపోయారని అనుకుంటారోనని సెలబ్రిటీలు, ముఖ్యంగా ఫిమేల్‌ సెలబ్రిటీలు భావిస్తున్నట్టున్నారు. సాధారణంగా మేల్‌ సెలబ్రిటీలు కాంట్రవర్షియల్‌ టాపిక్స్‌కి కాస్త దూరంగా వుంటారు కానీ ఆడవాళ్లలో మాత్రం ఫెమినిజమ్‌ సంబంధిత టాపిక్‌ వస్తే నూటికి తొంభై మంది స్వరం కలిపేస్తుంటారు. ఈ క్రమంలో మిగతా వారి కంటే తాము బాగా స్పందించామని అనిపించుకోవడానికి, లైక్‌లు, రీట్వీట్‌లు వేయించుకోవడానికి కొందరు హీరోయిన్లు సమయం, సందర్భం లేకుండా మాట్లాడేసి అనవసరంగా వున్న ఇమేజ్‌ చెడగొట్టుకుంటున్నారు. రెండు సంబంధం లేని టాపిక్స్‌ మధ్య లంకె వేసి సెటైర్‌ వేసేస్తే మామూలుగా మాట్లాడుకునే దగ్గర ఓకే కానీ సెంటిమెంట్లు బాగా ఫ్లో అవుతూ వుండే సోషల్‌ మీడియాలో చెల్లదు.

ఉదాహరణకి తాప్సీనే తీసుకుంటే నిన్న మొన్నటి వరకు ఆమె ఎంచుకుంటోన్న సినిమాలతో తాప్సీపై ప్రశంసలు కురుస్తుండేవి. మిగతా హీరోయిన్లలా అంగాంగ ప్రదర్శనలు కాకుండా రక్తమాంసాలున్న పాత్రలు చేస్తోందని కితాబులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆమెని శపిస్తున్న వారు, ఆమె పతనాన్ని కోరుకుంటోన్న వారు ఎక్కువయ్యారు. ఒక్క ట్వీట్‌లో మిస్టేక్‌ చేసి తాప్సీ ఇప్పుడు విలన్‌ అయింది. ఇకపై తన సినిమాలకి మునుపటిలా హోల్‌సమ్‌ అప్లాజ్‌ అయితే ఖచ్చితంగా రాదు. కాస్త బ్యాడ్‌గా వున్న సినిమా అయితే ఇక దానికి వచ్చే విమర్శల గురించి చెప్పనవసరం లేదు. అందుకే సోషల్‌ మీడియాలో ఏమి టైప్‌ చేస్తున్నామనేది మానిటర్‌ చేయడానికి అయినా ఒక టీమ్‌ని అపాయింట్‌ చేసుకుంటే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English