ఉరుము ఉరిమి నానిపై పడింది

ఉరుము ఉరిమి నానిపై పడింది

గ్యాంగ్‌లీడర్‌ రిలీజ్‌ వాయిదా వేయాలా లేక ముందుగా అనుకున్నట్టు ఆగస్టు 30నే విడుదల చేయాలా అని తెగ ఆలోచించుకుని నిన్ననే రిలీజ్‌ డేటు కన్‌ఫర్మ్‌ చేసారు. ఆగస్టు 30 రిలీజ్‌కి సిద్ధం చేస్తూ గ్యాంగ్‌లీడర్‌ బృందం తమ పనిలో తాము వుంటే, సాహో విడుదల వాయిదా పడి ఆగస్టు 30కి మారిందనే వార్త దావాలనంలా వ్యాపించింది. సాహో నిర్మాతలు కొత్త డేట్‌ అనౌన్స్‌ చేయకపోయినా కానీ తమకి తెలిసిన మీడియాకి స్వయంగా లీకులిచ్చినట్టు తెలిసింది. బాలీవుడ్‌ ట్రేడ్‌ పరిశీలకుడు తరన్‌ ఆదర్శ్‌ కూడా ఇదే డేట్‌ చెప్పడంతో సాహో ఆగస్ట్‌ 30ని టార్గెట్‌ చేస్తోందని తేలిపోయింది.

మరి సాహో కనుక ఆగస్టు 30కి వస్తున్నట్టయితే నాని 'గ్యాంగ్‌లీడర్‌' మాటేమిది? నానికంటూ గ్యారెంటీ మార్కెట్‌ వున్నా కానీ సాహోకి ఎదురు వెళ్లడం తెలివైన పని అనిపించుకోదు. అయితే సాహో నిజంగా ఆగస్ట్‌ 30కి వాయిదా పడిందో లేదో తెలుసుకుని అందుకు అనుగుణంగా గ్యాంగ్‌లీడర్‌ ఫ్లెక్సిబుల్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకోవాలి. సాహో మళ్లీ వాయిదా పడినా కానీ ఆగస్టు 30కే తమ సినిమా విడుదల చేసుకునేలా ముందే అన్నీ పూర్తి చేసుకుని పెట్టుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English