ప్రభాస్ భయపడ్డాడా?

ప్రభాస్ భయపడ్డాడా?

విడుదలకు నెల రోజులు కూడా సమయం లేదు. ఇంకా పాటల చిత్రీకరణ పూర్తయిందో లేదో తెలియదు. ఆడియో గురించి క్లారిటీ లేదు. ప్రమోషన్ల జాడ లేదు. వేర్వేరు నగరాల్లో రెండు మూడు టీంలు రేయింబవళ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగి ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ పనులూ ఇంకా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాహో’ అనుకున్న ప్రకారమే ఆగస్టు 15న విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు కొన్ని రోజుల నుంచి ప్రభాస్ అభిమానుల్ని తొలిచేస్తున్నాయి. అంతా అనుకున్న ప్రకారమే జరుగుతోందని.. ఆగస్టు 15కి రిలీజ్ పక్కా అని ‘యువి క్రియేషన్స్’ వాళ్లు ధీమా ప్రకటిస్తున్నా భయాలు వీడలేదు. చివరికి ఈ సందేహాలే నిజమయ్యాయి. ‘సాహో’ వాయిదా పడిపోయింది.

ఇంకా యువి వాళ్లు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆగస్టు 15కి ‘ఎవరు’, ‘రణరంగం’ కన్ఫమ్ కావడాన్ని బట్టి ‘సాహో’ వాయిదాను ధ్రువీకరించుకోవచ్చు. ఇదిలా ఉంటే ‘సాహో’ వాయిదాకు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం మాత్రమే కారణం కాదేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. ఆగస్టు 15కు రిలీజ్ చేసి తీరాలని పట్టుబడితే ఎలాగైనా సినిమాను రెడీ చేయొచ్చని.. ఐతే హడావుడి పడితే ఔట్ పుట్ దెబ్బ తింటుందన్న భయం ఒకటైతే.. హిందీలో ‘మిషన్ మంగళ్’, ‘బాట్లా హౌస్’ సినిమాలో బలమైన కంటెంట్‌తో ఆగస్టు 15న బాక్సాఫీస్ బరిలో దిగుతుండటం కూడా ‘సాహో’ టీంను కొంత కలవరపాటుకు గురి చేసిందని అంటున్నారు. వాటితో ‘సాహో’ పోటీ పడటం దీనికీ మంచిది కాదు. వాటికీ మంచిది కాదు. ఈ నేపథ్యంలోనే వాయిదా అన్ని రకాలుగా మంచిదని చిత్ర బృందం భావించినట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English