కమల్-రెహమాన్.. పెద్ద షాకిచ్చారు

కమల్-రెహమాన్.. పెద్ద షాకిచ్చారు

లోకనాయకుడు సినిమాలకు దూరమై చాలా కాలం అయింది. మరుగున పడి ఉన్న ‘విశ్వరూపం-2’ను గత ఏడాది ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేశాడు కానీ.. ఆయన యాక్టివ్‌గా షూటింగ్‌లో పాల్గొని రెండేళ్లు దాటుతోంది. రాజకీయ పార్టీ పెట్టాక దాని మీదే ఆయన దృష్టంతా కేంద్రీకృతమై ఉంది. రాజకీయాలకు కూడా ఉపయోగపడుతుందని ‘భారతీయుడు-2’ చేద్దామనుకున్నాడు కానీ.. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేక్ పడింది. ఐతే ఏదో ఒకటి చేసి దాన్ని మళ్లీ పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నా కుదురుతున్నట్లు లేదు. కమల్ చేస్తే ఆ సినిమా చేస్తాడు.. లేదంటే సినిమాల వైపు చూడడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఓ కొత్త సినిమా దిశగా సంకేతాలిచ్చి షాకిచ్చాడు. ఆ సినిమా పేరు.. తలైవన్ ఇరుక్కిండ్రాన్ (నాయకుడు ఉన్నాడు).

ఈ పేరుతో కమల్ ఇంతకుముందే సినిమా చేయాలనుకున్నాడు. స్క్రిప్టు రెడీ అయింది కూడా. స్వీయ దర్శకత్వంలో కమల్ చేయాలనుకున్న సినిమా ఇది. కానీ చాలా కమల్ సినిమాల్లాగే దీనికి బ్రేక్ పడింది. ఇప్పుడీ చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. దీనికి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ ఖరారయ్యాడు. ఇద్దరూ కలిసి ఒక ఫొటోకు పోజిస్తూ సినిమా గురించి ధ్రువీకరించారు. ‘భారతీయుడు-2’కు రెహమాన్‌ను కాదని కమల్-శంకర్.. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐతే భారతీయుడు-2 గురించి ఏదైనా అప్ డేట్ ఇస్తాడనుకుంటే.. దాన్ని పక్కన పెట్టేసి, రెహమాన్‌తో కలిసి ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ గురించి అనౌన్స్ చేసి పెద్ద షాకే ఇచ్చాడు కమల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English